టాలీవుడ్

Raashi Khanna: యామిని పాత్రకు కనెక్ట్ అయ్యాను కానీ అది ఎవరికీ నచ్చలేదు: రాశి ఖన్నా

Raashi Khanna: ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయింది రాశి ఖన్నా..

Raashi Khanna: యామిని పాత్రకు కనెక్ట్ అయ్యాను కానీ అది ఎవరికీ నచ్చలేదు: రాశి ఖన్నా
X

Raashi Khanna: సినిమాలన్నీ ప్రేక్షకులకు నచ్చుతాయి, నచ్చాలి అనే ఉద్దేశ్యంతోనే తెరకెక్కిస్తారు మేకర్స్. ఇక వారు చేసే పాత్రలు చూసేవారికి గుర్తుండిపోవాలి అనుకుంటున్నారు నటీనటులు. కానీ ఒక్కొక్కసారి వారి లెక్క కూడా తప్పు కావచ్చు. వారు చేసినవి ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. అయినా కూడా నటీనటులకు అవి ఫేవరెట్‌గానే నిలిచిపోతాయి. ఇటీవల తనకు అలాంటి పాత్ర ఏదో బయటపెట్టింది రాశి ఖన్నా.


'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన రాశి ఖన్నా.. ఇప్పటివరకు ఎంతోమంది యంగ్ హీరోలతో జోడీకట్టి.. ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల గోపీచంద్‌తో రెండోసారి కలిసి నటించిన 'పక్కా కమర్షియల్' కూడా పాజిటివ్ టాక్‌తో ముందుకెళ్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి.. తాను చేసిన పాత్రల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఊహలు గుసగుసలాడేలో ప్రభావతి క్యారెక్టర్, తొలిప్రేమలో వర్ష క్యారెక్టర్ తన ఫేవరెట్ అని తెలిపింది రాశి ఖన్నా. విజయ్ దేవరకొండతో చేసిన 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలోని యామిని క్యారెక్టర్ తనకు చాలా కనెక్ట్ అయ్యిందని, కానీ అది ప్రేక్షకులకు నచ్చలేదని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా భవిష్యత్తులో మరిన్ని గొప్ప పాత్రలు చేయాలనుందని రాశి ఖన్నా చెప్పింది.


పైగా నటిగా మారడం వల్ల తనకు చాలా అభిమానం దక్కిందని సంతోషం వ్యక్తం చేసింది రాశి. ప్రతిరోజు పండగే షూటింగ్ అప్పుడు ఓ అభిమాని తన దగ్గరకు వచ్చి చేతి మీద ఆటోగ్రాఫ్ తీసుకున్నాడని, తరువాతి రోజు దానిని టాటూ వేయించుకొని వచ్చాడని తెలిపింది. ఆ క్షణం తనకు చాలా ఆనందంగా అనిపించిందని చెప్పింది రాశి. అంతే కాకుండా అభిమానులు చూపించే ప్రేమకు ఎప్పటికీ కృతజ్ఞురాలినే అంటోంది.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES