బాలకృష్ణతో ఏడు సినిమాలు... ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయిన స్టార్ డైరెక్టర్...!

మహానటుడు నందమూరి తారకరామారావు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుది హిట్ కాంబినేషన్.. వీరి కాంబినేషన్‌లో వచ్చిన 12 సినిమాలు దాదాపుగా హిట్టే.. ఏఎన్నార్, కృష్ణంరాజు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలతో కూడా సినిమాలను చేసి హిట్స్ కొట్టారాయన.. అలాంటిది నటసింహం బాలకృష్ణకి మాత్రం ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయారు రాఘవేంద్రరావు. మొత్తం వీరి కాంబినేషన్‌లో ఏడు సినిమాలు రాగా ఏడు సినిమాలు పరాజయం పాలయ్యాయి. అయితే ఇందులో మూడు సినిమాలో విజయశాంతి హీరోయిన్‌గా నటించింది.
వీరి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా రౌడీ 'రాముడు కొంటె కృష్ణుడు'.. ఇందులో ఎన్‌టీ రామారావు, నందమూరి బాలకృష్ణ కలసి నటించారు. 1980లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా అలరించేలేకపోయింది. ఆ తరవాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రం 'పట్టాభిషేకం'.. 1985 లో వచ్చిన ఈ సినిమాని రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై నందమూరి హరికృష్ణ నిర్మించారు. ఇందులో విజయశాంతి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది.
వీరి కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం 'అపూర్వ సహోదరులు'.. బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేసిన మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. విజయశాంతి, భానుప్రియ హీరోయిన్లుగా నటించారు. భారీ హంగులతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక నాలుగో చిత్రంగా 'సహస సామ్రాట్' చిత్రం తెరకెక్కింది. ఇందులో కూడా విజయశాంతి హీరోయిన్‌గా నటించింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నమోదైంది.
వీరి కాంబినేషన్‌లో వచ్చన ఐదో చిత్రం 'దొంగరాముడు'.. రాధ హీరోయిన్.. కానీ సినిమా కూడా ఆడలేదు. దీనితో బాలకృష్ణ, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో సినిమాని చేయడానికి నిర్మాతలు కాస్త భయపడ్డారు. కానీ కాంబినేషన్‌ను సెట్ చేయడంలో మంచి పేరున్న అశ్వినీదత్ వీరి కాంబినేషన్‌తో ఓ సినిమాని చేశారు అదే 'అశ్వమేధం'.. శోభన్‌బాబు కీలకపాత్రాలో నటించారు. మీనా, నగ్మా హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం దారుణంగా ప్లాప్‌ని మూటగట్టుకుంది.
దాదాపుగా 16 ఏళ్ల తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్ సెట్ అయింది. అదే 'పాండురంగడు'. ఎన్టీఆర్ నటించిన పాండురంగ మహత్యం చిత్రం ఆధారంగా ఈ సినిమాని తెరక్కించారు. ఇందులో కళాతపస్వీ విశ్వనాధ్ కూడా నటించారు. అద్భుతమైన పాటలతో తెరకెక్కిన ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com