Rahul Ramakrishna: దమ్ముంటే సినిమా తీయండి అంటూ నటుడి ట్వీట్.. వెంటనే డిలీట్..

Rahul Ramakrishna: కొంతమంది నటీనటులు కాంట్రవర్సీల గురించి పట్టించుకోకుండా తమకు నచ్చింది మాట్లాడేస్తూ ఉంటారు. అలాంటివి కొన్నిసార్లు సెన్సేషన్ అవుతూ ఉంటాయి. అలాంటి నటులలో ఒకరు రాహుల్ రామకృష్ణ. అర్జున్ రెడ్డి సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పరిచయమయిన రాహుల్.. అతి కొద్దికాలంలోనే ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తాజాగా రాహుల్ ఓ కాంట్రవర్షియల్ ట్వీట్ చేసి ఆ వెంటనే డిలీట్ చేసేశాడు.
ప్రస్తుతం బిజీగా ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో రాహుల్ రామకృష్ణ కూడా ఒకరు. ఇటీవల రానా, సాయి పల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కిన 'విరాటపర్వం'లో కూడా రాహుల్ ఓ కీలక పాత్ర పోషించాడు. ఇందులో తన యాక్టింగ్‌కు ప్రేక్షకుల దగ్గర నుండి ప్రశంసలు కూడా అందుకున్నాడు. జులై 1న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో కూడా విడుదలయ్యింది. ఈ సందర్భంగా రాహుల్ రామకృష్ణ ఓ ట్వీట్ చేశాడు.
'మీకు దమ్ముంటే సినిమా తీయండి ఇడియట్స్' అంటూ దానికి ఒక భూతు పదం కూడా యాడ్ చేసి ట్వీట్ చేశాడు రాహుల్ రామకృష్ణ. కానీ కాసేపటికే దానిని డిలీట్ కూడా చేశాడు. మరికాసేటి తర్వాత 'అది నేను కాదు, నా ఈగో' అని మరో ట్వీట్ చేశాడు. అసలు రాహుల్ ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థంకాక నెటిజన్లు కన్ఫ్యూజన్‌లో పడ్డారు. మరికొందరు మాత్రం మస్త్ షేడ్స్ ఉన్నాయి అన్న నీలో అని కామెంట్ చేస్తున్నారు.
Was'nt me. It was my alter ego.
— Rahul Ramakrishna (@eyrahul) July 1, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com