సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న'జాతి రత్నాలు'.. హీరో నవీన్‌పై రాహుల్ రామకృష్ణ ఆగ్రహం

సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నజాతి రత్నాలు.. హీరో నవీన్‌పై రాహుల్ రామకృష్ణ ఆగ్రహం
ఏం రా నావల్లే మీకు ఇబ్బంది ఎదురవుతుంటే నేను జోగిపేటకు ఎల్లిపోతా అంటూ సినిమాలో అస్తమాను అలిగే క్యారెక్టర్ రాహుల్ రామకృష్ణది.

ఏం రా నావల్లే మీకు ఇబ్బంది ఎదురవుతుంటే నేను జోగిపేటకు ఎల్లిపోతా అంటూ సినిమాలో అస్తమాను అలిగే క్యారెక్టర్ రాహుల్ రామకృష్ణది. ఇప్పుడు సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ జాతిరత్నాలు ముగ్గురు. అయితే స్వదేశంలోనే కాక విదేశాల్లోనూ పేరు తెచ్చుకున్న మన జాతిరత్నాలు న్యూజెర్సీలో సందడి చేస్తున్నారు.

ఈ సక్సెస్ టూర్‌కు సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులతో పంచుకుంది చిత్ర నిర్మాణ సంస్థ స్వప్నా సినిమాస్. కాగా, ఈ వీడియోని చూసిన రాహుల్.. తనని తీస్కెళ్లకుండా మీరిద్దరు (నవీన్, ప్రియదర్శి) మాత్రమే వెళతారా అంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన రాహుల్ సరదాగా ఓ వీడియోని తీసి విడుదల చేశారు.

అరేయ్ దర్శి, నవీన్.. పీపుల్స్ ప్లాజాలో సక్సెస్ మీట్ అయ్యాక.. మిమ్మల్ని కలిసేలోపే పాస్‌పోర్ట్‌తో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి విమానం ఎక్కాస్తార్రా.. నేను చెప్పా కదరా నా దగ్గర పాన్ కార్డ్ ఉందని.. ఆ కార్డ్ చూపిస్తే అక్కడ ఎంట్రీ ఇస్తార్రా.. జోగిపేట రవిని రా నేను.

నా వల్లే మీకు ప్రాబ్లం అవుతుందని నన్ను వదిలేసి వెళ్లిపోయారు కదరా. రండ్రా మీరు వచ్చింతరువాత మీ సంగతి చెబుతా అంటే రాహుల్ సరదాగా ఓ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

యువ దర్శకుడు అనుదీప్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిన్న బడ్జెట్ చిత్రం పెద్ద సక్సెస్‌ని సాధించింది. అనుదీప్‌కు మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది. ఉప్పెనతో సక్సెస్ కొట్టేసిన విష్ణుతేజ్ అనుదీప్‌తో చిత్రం చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇక జాతిరత్నాలు మార్చి 11న విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది.

Tags

Read MoreRead Less
Next Story