Rajamouli : ఆ విషయంలో ఆర్ఆర్ఆర్ మూవీని నేనసలు నమ్మలేదు..

Rajamouli : రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఇప్పటికీ విస్తృత చర్చ జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అంత పెద్ద హిట్ అవుతుందని దర్శకుడు రాజమౌళి కూడా ఊహించలేదట. దీనికి సంబంధించిన విషయాలను ఆయన ఇటీవళ జరిగిన టొరంటో ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్‌లో వెళ్లడించారు. ఆర్ఆర్ఆర్ సినిమా కథ చేస్తున్నప్పుడు ఇతర రాష్ట్రాల వారికి బాగా నచ్చుతుందనే నమ్మకం ఉండేది కాదన్నారు. ఇక ఇతర దేశాలకు నచ్చుతుందని అసలు కలలో కూడా అనుకోలేదన్నారు జక్కన్న. జపాన్‌లో ప్రేక్షకులకు ఆర్ఆర్ఆర్ చాలా బాగా నచ్చిందన్నారు. అక్కడ వారి రివ్యూస్ చూసి నేనే షాక్‌కు గురయ్యానన్నారు.
తెలుగు సినిమాలు ఇతర దేశాలకు నచ్చుతాయని అనుకోలేదన్నారు ఆయన. హాలీవుడ్ స్టార్లు, హాలీవుడ్ దర్శకులు, హాలీవుడ్ ప్రొడ్యూసర్లకు కూడా తెలుగు ఓరియంటెడ్ మూవీ నచ్చింది. హాలీవుడ్‌కు నచ్చుతందని నేను వేరే తరహాలో సినిమా తీయలేనన్నారు. సొంత స్టైల్లో అనుకున్నట్లు ప్రత్యేకంగా తీయడమే వచ్చు. హాలీవుడ్‌కు నచ్చాలని నేనే వేరే విధానంలో సినిమా చేసి ఉంటే అంతగా నచ్చకపోవచ్చన్నారు రాజమౌళి.
రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక మహేశ్ బాబు హీరోగా ఓ అడ్వెంచర్ మూవీని తెరకెక్కించడానికి జక్కన్న రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన రెండు కథలున్నట్లు రచయిత విజయేంద్రప్రసాద్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com