RRR : 'జెన్నీఫర్‌'గా ఒలివియా లుక్ రిలీజ్!

RRR : జెన్నీఫర్‌గా ఒలివియా లుక్ రిలీజ్!
కొమరం భీం పాత్రలో నటిస్తున్న తారక్‌కు జోడిగా ఉండే జెన్నిఫర్ అనే యువతి పాత్రలో ఈ అమ్మడు మెరవనుంది.

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం త్రిబుల్ ఆర్... ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ రోజు సినిమా నుంచి ఒలివియా మోరిస్ లుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్. కొమరం భీం పాత్రలో నటిస్తున్న తారక్‌కు జోడిగా ఉండే జెన్నిఫర్ అనే యువతి పాత్రలో ఈ అమ్మడు మెరవనుంది. ఈరోజు ఒలివియా బర్త్ డే సందర్భంగా చిత్రబృందం ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేసింది. ఓ వింటేజ్ మోడల్ కార్‌లో కూర్చుని నవ్వుతున్న 'జెన్నీఫర్' చిత్రం ఆకట్టుకుంటోంది. ఇప్పటికే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో.. RRR షూటింగ్ శరవేగంగా చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాని అక్టోబర్ 13 న రిలీజ్ చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story