Rajamouli: 'కొమురం భీముడో పాటకు ఆ హాలీవుడ్ సినిమానే ఇన్‌స్పిరేషన్'

Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'.. దేశ, భాషల సరిహద్దులు దాటి హాలీవుడ్ వరకు చేరింది. ముఖ్యంగా హాలీవుడ్‌లో పలువురు ప్రముఖ దర్శకులు ఈ సినిమాను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. అంతే కాకుండా మరికొందరు అయితే నేరుగా రాజమౌళితోనే ఆ సినిమా అనుభవాన్ని పంచుకుంటున్నారు. అలాగే తాజాగా రాజమౌళి ఓ హాలీవుడ్ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్నాడు. అందులో కొమురం భీముడో పాటకు ఇన్‌స్పిరేషన్ ఎవరో బయటపెట్టాడు.
'ఆర్ఆర్ఆర్'లో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ పోటాపోటీగా నటించారు. ఒకరికి తక్కువ ప్రాముఖ్యత లభించిందంటూ ఫ్యాన్స్ విమర్శలు చేసినా.. అవి కొంతకాలానికి కనుమరుగయిపోయాయి. అయితే ముఖ్యంగా కొమురం భీముడో పాటలో ఎన్‌టీఆర్ పర్ఫార్మెన్స్‌కు ఎంతోమంది ఫ్యాన్స్ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఇందులో తన పర్ఫార్మెన్స్.. తనను ఆస్కార్‌కు దగ్గర చేసింది. అయితే దీని వెనుక ఓ హాలీవుడ్ సినిమా ఇన్‌స్పిరేషన్ ఉందని రాజమౌళి చెప్పుకొచ్చాడు.
హాలీవుడ్ దర్శకుడు మెల్ గిబ్సన్ తెరకెక్కించిన 'బ్రేవ్ హార్ట్' చిత్రం కొమురం భీముడో పాటకు ఇన్‌స్పిరేషన్ అని బయటపెట్టాడు రాజమౌళి. అంతే కాకుండా మెల్ గిబ్సన్ ద్రోణాచార్యుడు అయితే.. తాను ఏకలవ్యూడని అన్నాడు. దీంతో రాజమౌళి.. మెల్ గిబ్సన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ విడుదలయ్యి చాలా నెలలు అయినా కూడా ఇప్పటికీ ఎంతోమంది ఈ మ్యానియా నుండి బయటికి రాలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com