రాజశేఖర్ కోలుకుంటున్నారు: జీవిత

రాజశేఖర్ కోలుకుంటున్నారు: జీవిత
ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన్ని..

కరోనా బారిన పడిన నటుడు రాజశేఖర్ సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై నటుడి భార్య జీవిత మాట్లాడుతూ రాజశేఖర్ ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉందని ఓ వీడియోలో పేర్కొన్నారు. ఆస్పత్రి వైద్యులు ఆయన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని అన్నారు. అయితే ఆయన వెంటలేటర్‌పై ఉన్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన్ని ఎప్పుడూ వెంటిలేటర్‌పై ఉంచలేదని జీవిత పేర్కొన్నారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని వివరించారు. త్వరలోనే ఐసీయూ నుంచి కూడా బయటకు వచ్చే అవకాశాలు కనబడుతున్నట్లు డాక్టర్లు వివరించారని అన్నారు. అభిమానులకు ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞలు తెలియజేశారు. వారు చేసిన ప్రార్థనలు ఫలించి ఆయన కోలుకుంటున్నారని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story