గోపీచంద్ మూవీలో విలన్ గా రాజశేఖర్..!

గోపీచంద్ మూవీలో విలన్ గా రాజశేఖర్..!
యాక్షన్ హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్‌‌‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

యాక్షన్ హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్‌‌‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లక్ష్యం, లౌక్యం సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌‌లో ఈ సినిమా వస్తుంది. అయితే ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో హీరో రాజశేఖర్ విలన్‌‌గా కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. సినిమాలో ప్రతినాయకుడి పాత్రకి హీరో రాజశేఖర్ అయితే బాగుంటుందని దర్శకుడు శ్రీవాస్ భావించారట. అందులో భాగంగానే రాజశేఖర్‌‌తో సంప్రదింపులు జరపారట. కథ విన్న రాజశేఖర్ కూడా విలన్‌‌గా నటించడానికి ఒకే చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. అయితే దీనిపైన అధికార ప్రకటన రావాల్సి ఉంది. అటు రాజశేఖర్ ప్రస్తుతం హీరోగా 'మర్మాణువు' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story