Rajayogam Review : ప్రేక్ష‌కుల‌కు న‌వ్వులయోగం : రాజయోగం రివ్యూ

Rajayogam Review : ప్రేక్ష‌కుల‌కు న‌వ్వులయోగం : రాజయోగం రివ్యూ
అన్ లిమెటడ్ ఫ‌న్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా రాజ‌యోగం; ప్రేక్ష‌కుల‌కు న‌వ్వుల యోగం క‌లిగిస్తోన్న చిత్రం...

Rajayogam Review : ప్రేక్ష‌కుల‌కు న‌వ్వులయోగం : రాజయోగం రివ్యూ


యూత్ ని ఆక‌ట్టుకునే కంటెంట్ తో వ‌స్తున్నామ‌ని ప్ర‌చారంలో హొరెత్తించిన రాజ‌యోగం ఈ రోజు (30న‌)ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటించారు. శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ లిమిటెడ్ రోమాన్స్ ఉంటుంద‌ని ముందు నుంచీ హోరెత్తించిన చిత్ర యూనిట్ ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.


కథ:

ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన రుషి(సాయి రోనక్) కారు మెకానిక్. ఎలాగైనా డబ్బున్న అమ్మాయిని ప్రేమించేసి… జీవితంలో సెటిల్ అయిపోవాలనుకుంటాడు. అనుకోకుండా వ‌చ్చిన అవ‌కాశాన్ని వాడుకొని ఒక స్టార్ హోట‌ల్ లో బిలినీయ‌ర్ అంటూ బిల్డ‌ప్ లు ఇచ్చి శ్రీ (అంకిత సాహా)ని ప్రేమ‌లో ప‌డేస్తాడు. అయితే ట్విస్ట్ ఏంటంటే... శ్రీ త‌నకు జీవితంలో డ‌బ్బుకు మించినది మరేదీ లేద‌ని చెప్పి వెళ్లిపోతుంది.

మరోవైపు ఆ హోట‌ల్ లో ఒక అరుదైన వ‌జ్రం కోసం డేనియ‌ల్, రాధా ముఠాలు వేరు వేరుగా ప్ర‌య‌త్నిస్తుంటాయి. శ్రీ వాళ్ల‌తో వెళ్లిపోతుంది. దాంతో ఎలాగైనా ఆమె గుట్టు రట్టు చేసేందుకు రుషి ఆమెను అనుసరిస్తాడు. ఈ క్రమంలో రుషికి ఎదురైన అనుభవాలు ఏంటి? అసలు శ్రీ ఎలాంటి అమ్మాయి? డేనియల్ దగ్గర నుంచి రాధా వజ్రాలను కొట్టేశాడా? అందుకు శ్రీ ఎలా ఉపయోగపడింది? ఈ వజ్రాలకు ఐశ్వర్య(బిస్మి నాస్) అనే అమ్మాయికి సంబంధం ఏమిటి? తదితర వివరాలు రాజయోగం సినిమా చూస్తేనే తెలుస్తుంది.


కథ… కథనం... విశ్లేషణ:

ముందు నుంచి ద‌ర్శ‌కుడు రామ్ గ‌ణ‌ప‌తి చెబుతున్న‌ట్లుగానే రాజ‌యోగంలో రోమాన్స్ మోతాదును గట్టిగానే దండించారు. హిందీలో గ్రాండ్ మ‌స్తీ రేంజ్ లో అందాల ఆర‌బోత క‌నిపించింది. ఇక హీరోయిన్ శ్రీ పాత్ర లో అంకిత క‌నువిందు చేసింది. పాట‌ల్లో బోల్డ్ గా క‌నిపించింది. డ‌బ్బు త‌ప్ప మ‌రో ఆలోచ‌న లేని క‌ట్ త్రూ క‌న్నింగ్ క్యారెక్ట‌ర్ లో అంకిత‌ ఒదిగిపోయింది.


ఇక సాయిరోన‌క్ కు ఇప్పటి వరకూ ఇలాంటి క్యారెక్టర్ పడలేదనే చెప్పాలి. చూడ‌టానికి చ‌క్క‌గా ఉండే అత‌ని రూపం, డాన్సింగ్ టాలెంట్ .. ఫైట్స్ లో వేగం, న‌ట‌న‌లో ఈజ్ ఇవ‌న్నీ 'రాజ‌యోగం'లో ఎలివేట్ అయ్యాయి. కిలాడీ లేడీల వ‌ల‌లో ప‌డి న‌లిగిపోయే యువ‌కుడి పాత్ర‌లో సాయిరోన‌క్ మెప్పించాడు.


అయితే మోసం వెన‌క ఆశ ఉంటుంది. మోస‌పోయే ప్ర‌తి వాడికీ ఎర ఆశే అవుతుంది. ఈ పాయింట్ ను ద‌ర్శ‌కుడు రామ్ గ‌ణ‌ప‌తి బాగా డీల్ చేశారు. క్రైమ్ కామెడీకి కావాల్సిన ఎలిమెంట్స్ ని చ‌క్క‌గా పోందుప‌రిచాడు. గతంలో ఇవివీ స‌త్య‌న్నార‌య‌ణ గారు చేసిన 'ఎవ‌డిగోల వాడిది' ఛాయ‌లు 'రాజ‌యోగం'లో క‌నిపించాయి.


అజ‌య్ ఘోష్ పాత్ర రాజ‌యోగానికి హైలెట్ గా నిలుస్తుంది. అత‌నిలోని టాలెంట్ ని గుర్తించ‌డంలో ద‌ర్శ‌కులు మారుతి, సుకుమార్ త‌ర్వాత రామ్ గ‌ణ‌ప‌తే అని చెప్పాలి. స్ట్రెస్ ఎక్కువ‌యితే బ్లైండ్ నెస్ వ‌చ్చే రౌడీ గ్యాంగ్ లీడ‌ర్ గా అజ‌య్ ఘోష్ పండించిన హాస్యం రాజ‌యోగాన్ని న‌వ్వుల యోగం చేసింది.


సాయిరోన‌క్ ప్రెండ్ గా యాక్ట్ చేసిన న‌టుడు కూడా ఆక‌ట్టుకున్నాడు. డేనియల్ పాత్రలో సిజ్జు చేసిన విలన్ పాత్ర కూడా కొత్తగా అనిపిస్తుంది. "రాజయోగం" అంటే ఒక వజ్రం కోసం జరిగే వేట. ఆ వజ్రం ఎవరికీ దొరికింది ఆ రాజయోగం ఎవరికీ వరించింది అనేదే ఈ సినిమా కథ. ఈ పాయింట్ చూట్టూ యువ‌తను ఆక‌ట్టుకునే రోమాన్స్ కామెడీ ల‌తో ద‌ర్శ‌కుడు రామ్ గ‌ణ ప‌తి అల్లుకున్న క‌థ‌నం బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్ కామెడీ బాగా నవ్విస్తుంది.

చివ‌రిగా:

అన్ లిమెటడ్ ఫ‌న్ కి కేరాఫ్ అడ్ర‌స్ రాజ‌యోగం. బోల్డ్ నెస్ అనేది క‌థ‌లో బాగం అయినా కామెడీ బాగా ఆక‌ట్టుకుంది.

రాజ‌యోగం ప్రేక్ష‌కుల‌కు న‌వ్వుల యోగం క‌లిగిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story