Rajeev Kanakala : మా ఇంటి సమస్యల్లో అతను పెద్దరికం తీసుకుంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను ?

Rajeev Kanakala : మరో నాలుగు రోజుల్లో జరగబోయే మా ఎన్నికల పైన సినీ నటుడు రాజీవ్ కనకాల స్పందించారు. తాను విష్ణు ప్యానల్‌కు సపోర్ట్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. లవ్ స్టొరీ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాల పైన స్పందించారు. అందులో భాగంగా మా ఎన్నికల పైన మాట్లాడారు.
" గత ఎన్నికల్లో నేను శివాజీరాజా ప్యానల్ నుంచి పోటీ చేసి కోశాధికారి పదవి పొందాను.. ఆ ప్యానల్ నుంచి గెలిచిన ఏకైక వ్యక్తిని నేను మాత్రమే.. ఆ సమయంలో నరేశ్ టీమ్‌తో కలిసి పనిచేశాను. దాదాపుగా 40 మంది ఆర్టిస్టులకి సినిమా అవకాశాలు కల్పించాము. కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేసేవారు మాత్రం మా గురించి ఎన్నో కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో నా మద్దతు విష్ణు ప్యానల్ కి ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.
భవిష్యత్తులో మహేశ్, ప్రభాస్ ఎన్టీఆర్ కూడా విష్ణు ప్యానల్ కి మద్దతు ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారు రాజీవ్.. అతనికి మా బిల్డింగ్ పైన సభ్యుల సంక్షేమంపై మంచి అవగాహన ఉందని అన్నారు. ఇక మా ఇంటికి ఎవరైనా బంధువు వస్తే అతనికి అన్ని మర్యాదలు చేసి ఆతిధ్యం ఇస్తాను తప్పా.... మా ఇంటి సమస్యల్లో అతను పెద్దరికం తీసుకుంటే.. నేను ఎందుకు ఒప్పుకుంటాను అని వ్యాఖ్యానించారు రాజీవ్ కనకాల.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com