Rajinikanth-Chandrababu : అపూర్వ కలయిక... రజినీ ట్వీట్ వైరల్
hyderabad

X
By - Chitralekha |10 Jan 2023 6:45 PM IST
పాత స్నేహితుడిని కలసిన తలైవ; వైరల్ అవుతున్న రజినీకాంత్ ట్వీట్....
సూపర్ స్టార్ రజినీకాంత్, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భేటీ జాతీయ మీడియా దృష్టిని ఆకట్టుకుంటోంది. జైలర్ సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ విచ్చేసిన తలైవ తేదేపా అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలసినట్లు తెలుస్తోంది. చిరకాల స్నేహితులైన ఇరువురూ సరదాగా కలసి ఎన్నో కబుర్లు కలబోసుకున్నారని తెలుస్తోంది.
ఇక భేటీ సమయంలో చంద్రబాబుతో కలసి దిగిన ఫొటోను రజినీకాంత్ ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా సదరు పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చాలాకాలం తరువాత తన ప్రియతమ స్నేహితుడైన చంద్రబాబును కలశానని, మరచిపోలేని సమయాన్ని గడిపాను అని చెప్పిన చేసిన రజినీ, చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని, అతడి పొలిటికల్ కెరీర్ విజయవంతగా సాగాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com