Rajinikanth : బస్ డ్రైవర్‌కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అంకితం ఇచ్చిన రజినీ..!

Rajinikanth : సౌత్ ఇండియా సూపర్‌స్టార్ రజీనికాంత్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో నేడు 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదిగా రజినీకాంత్ ఈ అవార్డును అందుకున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా చిత్రపరిశ్రమకి రజనీకాంత్ చేస్తోన్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనని ఈ పురస్కారంతో గౌరవించింది.
అనంతరం మాట్లాడిన రజినీ తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. తనని ఈ స్థాయికి తీసుకొచ్చిన వారందరినీ గుర్తుచేసుకున్నారు. తాను ఈ స్థాయికి రావడానికి కారణమైన తన గురువు బాలచందర్, అన్నయ్య సత్యనారాయణరావు గైక్వాడ్, నా మిత్రుడు రాజ్ బహుదూర్ , చిత్రనిర్మాతలు, దర్షకులు, థియేటర్ యజమానులు, సాంకేతిక నిపుణులు మరియు అభిమానులకు, తమిళ ప్రేక్షకులకి ఈ అవార్డుని అకింతం ఇస్తున్నట్టుగా వెల్లడించాడు.
అసురన్ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న తన అల్లుడు ధనుష్‌తో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు రజినీ.. ఈ వేడుకలో రజనీకాంత్ భార్య లత మరియు కుమార్తె ఐశ్వర్య కూడా అక్కడే ఉన్నారు.
🙏🏻🇮🇳 pic.twitter.com/vkTf6mxYUu
— Rajinikanth (@rajinikanth) October 24, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com