రజనీకాంత్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు..!

రజనీకాంత్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు..!
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. సినీ రంగంలో విశేష కృషి చేసినందుకు గాను ఈ అవార్డు ప్రకటించారు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. సినీ రంగంలో విశేష కృషి చేసినందుకు గాను ఈ అవార్డు ప్రకటించారు. 2020వ సంవత్సరానికి గాను ఈ 51వ దాదా సాహెబ్ ఫాల్కె అవార్డును రజనీకి ఇస్తున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేవర్‌ ప్రకటించారు. నటుడిగాను, నిర్మాతగానే కాకుండా విభిన్న పాత్రల్లో సినిమా రంగం అభివృద్ధికి విశేష కృషి చేసినందుకే తలైవాను ఈ పురస్కారానికి ఎంపి చేసినట్టు చెప్పారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. రజనీకాంత్‌కు అత్యున్నత అవార్డు ప్రకటించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

పద్మవిభూషణ్‌ రజనీకాంత్‌ ఆలిండియా సూపర్‌స్టార్‌గా పేరుతెచ్చుకున్నారు. దక్షిణాదినే కాకుండా పాన్ ఇండియా చిత్రాలతో బాలీవుడ్‌లోనూ ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది. అవార్డులు తలైవాకి కొత్త కాకపోయినా.. భారతీయ సినిమారంగంలో అత్యుత్తమ పురస్కారంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోబోతుండడం పట్ల అభిమానులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ భారతం నుంచి ఈ పురస్కారానికి అందుకుంటున్న 12వ వ్యక్తి రజనీకాంత్‌ కావడం విశేషం. అలనాటి దిగ్గజాలు రాజ్‌కుమార్‌, అక్కినేని నాగేశ్వర్రావు, కె.బాలచందర్ సహా మరికొందరు ప్రముఖులు కూడా ఈ అత్యుత్తమ పురస్కారాన్ని అందుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story