ఫోటోలు షేర్ చేస్తూ.. కామెంట్స్ చేసిన వారితో రకుల్..

ఫోటోలు షేర్ చేస్తూ.. కామెంట్స్ చేసిన వారితో రకుల్..
ఫోటోలు చూసి సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.

ఆ సినిమాలో హీరోయిన్ అందాల ఆరబోతకే ప్రాధాన్యత ఇచ్చింది అనే రోజులకు కాలం చెల్లింది. ఆమె పాత్రను కూడా బలంగా తీర్చి దిద్దుతున్నారు దర్శక నిర్మాతలు.. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతో పాటు.. కూరలో కరివేపాకులా తీసేయకుండా హీరోయిన్ పాత్రను కూడా అందంగా మలుస్తున్నారు నేటి దర్శకులు. తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా వంద శాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు నటీమణులు.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఓ చిత్రం కోసం 40 రోజుల్లో 8 కిలోలు తగ్గింది. బాలీవుడ్ చిత్రం 'దే దే ప్యార్ దే' కోసం పని చేస్తున్నప్పుడు బరువు తగ్గాల్సి వచ్చింది. రోజుకి 4 గంటలు జిమ్‌లో వర్కవుట్లు చేసి 8 కిలోల బరువు తగ్గి స్లిమ్‌గా అయిపోయేసరికి.. ఫోటోలు చూసి సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఏంటి ఇంత సన్నగా అయిపోయావ్.. ఇక నీ సినిమాలు ఎవరూ చూడరు.. నీ పని అయిపోయింది.. ఇక నీకు తెలుగులో అవకాశాలు రావు అని కామెంట్లు చేశారు.

ఈ కామెంట్లు ఒకింత బాధకు గురి చేసిన వాటిని పట్టించుకుంటే ముందుకు పోవడం కష్టమని భావించి నన్ను నేను సమాధాన పరుచుకున్నా. కళ్లు మూసుకుని మనసుకి ఒకటే చెప్పుకున్నా ఏదీ పట్టించుకోకు.. నీ పనే ఆ విమర్శలకు సమాధానం చెబుతుంది అని సముదాయించుకున్నాను. అనుకున్నట్లుగానే ఆ చిత్రం నాకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది అని చెప్పింది రకుల్. కాగా తెలుగులో రకుల్ నితిన్‌తో 'చెక్', బాలీవుడ్‌ల్ 'మేడే' చిత్రంలోనూ నటిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story