టాలీవుడ్

Rakul Preet Singh: హాట్ డ్యాన్స్‌తో రకుల్ పోస్ట్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే..?

Rakul Preet Singh: తాజాగా రకుల్.. తనకు నచ్చిన పాటపై హాట్ మూవ్స్‌తో డ్యాన్స్ చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది.

Rakul Preet Singh: హాట్ డ్యాన్స్‌తో రకుల్ పోస్ట్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే..?
X

Rakul Preet Singh: సినీ సెలబ్రిటీలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా లేకపోయినా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ తమ ఫ్యాన్స్‌కు అందుబాటులోనే ఉంటారు. సోషల్ మీడియా ద్వరా తమ ఫ్యాన్స్‌ను సంతోషపెట్టడానికి నటీనటులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్.. ఓ హాట్ డ్యాన్స్ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. తన బాయ్‌ఫ్రెండ్ జాకీ భ‌గ్నానీ ఆ పోస్ట్‌కు ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టాడు.

రకుల్.. తెలుగులో హీరోయిన్‌గా పరిచయమయినా ప్రస్తుతం హిందీలోనే తాను ఎక్కువ చిత్రాలు చేస్తూ బిజీగా గడిపేస్తోంది. హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే తాను హీరో జాకీ భ‌గ్నానీతో రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. ఆ తర్వాత పెళ్లి గురించి పదే పదే అడగొద్దు అంటూ అసహనానికి లోనయ్యి మరోసారి వార్తల్లోక్కెక్కింది.

తాజాగా రకుల్.. తనకు నచ్చిన పాటపై హాట్ మూవ్స్‌తో డ్యాన్స్ చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. దీనికి తన అభిమానులు.. బాగుందంటూ కామెంట్స్ చేశారు. అందులో జాకీ భ‌గ్నానీ కామెంట్ కూడా ఉంది. 'నాతో కూడా నేర్పించవా' అంటూ జాకీ.. ఈ వీడియోకు కామెంట్ చేశాడు. దీంతో వీరిద్దరి రిలేషన్‌షిప్ చాలా క్యూట్ అంటూ నెటిజన్లు మరోసారి ప్రశంసించారు.


Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES