Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. సైలెంట్‌గా బాలీవుడ్ మూవీ పూర్తి చేసిన హీరో..

Ram Charan: పాన్ ఇండియా చిత్రాలతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోలు.. నేరుగా ఇతర భాషల్లో నటించడానికి కూడా వెనకాడడం లేదు. అంతే కాకుండా చాలావరకు సౌత్ హీరోలు హిందీ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే మెగా హీరో రామ్ చరణ్ కూడా సైలెంట్‌గా ఓ బాలీవుడ్ చిత్రాన్ని పూర్తి చేసినట్టు టాక్ వినిపిస్తోంది.
'ఆర్ఆర్ఆర్' సినిమా రామ్ చరణ్‌కు కూడా పాన్ ఇండియా స్టార్ అనే ట్యాగ్‌ను తెచ్చిపెట్టింది. అందుకే తమిళ దర్శకుడు శంకర్‌తో తాను చేస్తు్న్న తరువాతి చిత్రం కూడా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఇంతలోనే రామ్ చరణ్ ఓ బాలీవుడ్ చిత్రంలో నటించాడని, షూటింగ్ కూడా పూర్తయ్యిందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ సీనియర్ హీరో సల్మా్న్ ఖాన్.. ఇప్పటికే చిరంజీవితో కలిసి 'గాడ్ ఫాదర్' చిత్రంలో నటిస్తున్నాడు. అందుకే సల్మాన్ అడిగిన వెంటనే 'ఆచార్య' మూవీ సెట్‌ను తన సినిమా 'కభీ ఈద్ కభీ దివాళి' షూటింగ్ కోసం ఇచ్చేశాడు చిరు. అయితే ఈ సెట్‌లో ప్రస్తుతం ఓ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారట. ఈ పాటలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేయనున్నాడని సమాచారం. అంతే కాకుండా దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయ్యిందట. అయితే ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వడం కోసం ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచాలని మూవీ టీమ్ నిర్ణయించిందట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com