Ram Charan Upasana : అపోలో హాస్పిటల్ లో ఉపాసన డెలివరీ

Ram Charan Upasana : అపోలో హాస్పిటల్ లో ఉపాసన డెలివరీ
డాక్టర్ సుమనా మనోహర్, డాక్టర్ రూమా సిన్హా తో పాటు డాక్టర్ జెన్నిఫర్ ఆష్టన్ ల పర్యవేక్షణలో డెలివరీ జరుగనుంది

మెగా పవర్ స్టార్ రాం చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికా పర్యటలో ఉన్నందువలన అక్కడే బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలకు ముగింపుగా ఉపాసనా చరణ్ దంపతులు డెలివరీ ఎక్కడ జరుగుతుందో తెలిపారు. తాము భారత్ లోనే అదీగాక అపోలో హాస్పిటల్ లో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలిపారు.

డాక్టర్ సుమనా మనోహర్, డాక్టర్ రూమా సిన్హా తో పాటు డాక్టర్ జెన్నిఫర్ ఆష్టన్ ల పర్యవేక్షణలో డెలివరీ జరుగనుంది. భారత దేశంలోనే తమ బిడ్డ జన్మించనున్నట్లు తెలిపిన ఉపాసన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అమెరికాలో ప్రముఖ గైనకాలజిస్ట్ జెన్నిఫర్ ఆస్టన్ ను కలిసిన రాం చరణ్, తన భార్య ఉపాసన డెలివరీకి అందుబాటులో ఉండాలని కోరారు. అందుకు జెన్నిఫర్ ఒప్పుకున్నారు. "మీతో ట్రావెల్ చేయడానికి రెడీ. మీ ఫస్ట్ బేబీని డెలివరీ చేయడం నాకు గౌరవం" అని అన్నారు జెన్నిఫర్.

Tags

Read MoreRead Less
Next Story