ఆర్జీవీ చర్యలు ఊహాతీతం.. బర్త్‌డే పార్టీలో రెచ్చిపోయిన వర్మ..!

ఇండస్ట్రీలో వివాదాలు, సంచలన వ్యాఖ్యలు అంటే టక్కున గుర్తొచ్చే పేరు రామ్‌గోపాల్‌వర్మ.. తరచూ కాంట్రవర్సీలతో వార్తల్లో ఉండడం అర్జీవీ స్పెషాలిటీ. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు వర్మ. ఇనయా సుల్తానా అనే అమ్మాయి బర్త్ డే పార్టీకి హాజరైన వర్మ నానా హంగామా చేశారు. ఆ అమ్మాయితో కలిసి డాన్స్ చేసి చివరకు ఆమె కాళ్ల మీద కూడా పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో పైన వర్మ ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో స్పందించారు. ఈ వీడియోలో ఉన్న మనిషి నేను కాదు.. రెడ్ డ్రెస్సులో ఉన్నది సుల్తానా కాదు.. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ మీద ఒట్టేసి చెబుతున్నాను అంటూ పేర్కొన్నారు. ఈ వీడియో బాగా సర్కిలేట్ అవ్వడంతో అర్జీవీ చర్యలు ఉహతీతం అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Also Read :
♦ అమ్మాయి బర్త్‌డే పార్టీ.. వర్మ తుంటరి చేష్టలు..!
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com