Ram Gopal Varma: కేసీఆర్ బయోపిక్‌పై వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Ram Gopal Varma: ఫిక్షన్ కథలకంటే బయోపిక్‌లకు ప్రేక్షకుల్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఏ బయోపిక్‌ను అయినా మనసుకు హత్తుకునేలా తెరకెక్కిస్తే అది ప్రేక్షకులకు దగ్గరవ్వడంతో పాటు కమర్షియల్‌గా కూడా సక్సెస్ అవుతుంది. అయితే టాలీవుడ్‌లో అత్యధిక బయోపిక్స్ తెరకెక్కించిన దర్శకులలో రామ్ గోపాల్ వర్మ కూడా ఒకరు. ఇటీవల కేసీఆర్ బయోపిక్‌పై వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
యథార్థ సంఘటనలకు తనదైన కల్పితాన్ని జోడించి సినిమాలను తెరకెక్కించడంలో వర్మ దిట్ట. అలాగే ఇప్పటివరకు ఎన్నో కాంట్రవర్షియల్ కథలను వర్మ.. ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చారు. తన సినిమాలు విడుదల కాకుండా ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా.. ఎలాగైనా విడుదల చేశారు వర్మ. అలాంటి కేసీఆర్ బయోపిక్ కూడా తీస్తే బాగుంటుందని కొందరు అభిమానులు అనుకుంటున్నారు.
తాను దర్శకత్వం వహించిన 'కొండా' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్టుగా తాను చూపించనన్నారు వర్మ. అయితే ఈ ఈవెంట్‌లో తనను కేసీఆర్ బయోపిక్ గురించి అడగగా.. ఆ ఆలోచన ఉంది కానీ ఎప్పుడు జరుగుతుందో చెప్పలేను. కేసీఆర్‌పై పరోక్షంగా పలు సినిమాలు వచ్చినా.. బయోపిక్ మాత్రం వర్మ చేతుల మీదుగా తెరకెక్కడమనేది ప్రేక్షకుల్లో అంచనాలు పెంచే విషయమే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com