RGV Twitter: 'ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ కంటే కార్తికేయ 2నే బ్లాక్‌బస్టర్'.. ఆర్జీవీ ట్వీట్

RGV Twitter: రామ్ గోపాల్ వర్మకు ఏదైనా నచ్చకపోతే ఎంత ఘాటుగా స్పందిస్తారో.. నచ్చితే కూడా అంతే స్వీటుగా స్పందిస్తారు. కానీ అందులో కూడా ఏదో ఒక చిన్న కాంట్రవర్సీ ఉంటుంది. ఏదైనా స్ట్రెయిట్‌గా చెప్పడం వర్మకు అసలు అలవాటే లేదు. అందుకే ఇటీవల విడుదలయిన 'కార్తికేయ 2' సక్సెస్‌పై కూడా స్పందించారు ఆర్జీవీ. కానీ అదే సమయంలో పలువురు పెద్ద డైరెక్టర్లపై హాట్ కామెంట్స్ చేశారు.
నిఖిల్ హీరోగా తెరకెక్కిన 'కార్తికేయ 2' తక్కువ స్క్రీన్స్‌లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. కానీ మొదటిరోజే బ్లాక్‌బస్టర్ టాక్ అందుకోవడంతో రెండో రోజు నుండి కలెక్షన్స్‌తో పాటు స్క్రీన్స్ కూడా పెరిగాయి. ఇప్పటికీ మౌత్ టాక్‌తోనే థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది కార్తికేయ 2. ఈ సినిమాలో చూపించిన కృష్ణుడు, ద్వారకాలాంటి అంశాలు ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి.
చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2.. ఆర్జీవీని ఇంప్రెస్ చేయడంతో దీనిపై ట్వీట్ చేశారు. 'నిఖిల్ హీరోగా అభిషేక్ నిర్మాతగా తెరకెక్కిన కార్తికేయ 2 రెండో శుక్రవారం అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్ కంటే డబుల్ కలెక్షన్స్‌ను సాధిస్తోంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్‌కంటే, ప్రశాంత్ నీల్ కేజీఎఫ్2 కంటే పెద్ద బ్లాక్‌బస్టర్ అని ప్రూవ్ చేసుకుంది. ఇందుకు చందు మొండేటికి కంగ్రాట్స్' అని చెప్పుకొచ్చారు వర్మ.
. @actor_nikhil 's #karthikeya2 produced by @abhishekofficl on 2nd Friday doing DOUBLE COLLECTIONS of #AamirKhan 's #LSJ and @AkshayKumar 's #RakshaBandhan proves on ROI,K2 is BIGGER BLOCKBUSTER than @ssrajamouli 's #RRR and @Prashant_neel 's #KGF2 ..CONGRATS to @chandoomondeti
— Ram Gopal Varma (@RGVzoomin) August 20, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com