టాలీవుడ్

Ram Pothineni: రామ్ అప్‌కమింగ్ మూవీ ఫిక్స్.. ఏకంగా స్టార్ డైరెక్టర్‌తో..

Ram Pothineni: ది వారియర్ తర్వాత టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటితో రామ్ సినిమా ఉండబోతుందని తెలిసిన విషయమే.

Ram Pothineni: రామ్ అప్‌కమింగ్ మూవీ ఫిక్స్.. ఏకంగా స్టార్ డైరెక్టర్‌తో..
X

Ram Pothineni: ఈమధ్య యంగ్ హీరో, స్టార్ హీరో అని తేడా లేకుండా అంచనాలకు అతీతంగా హిట్లు కొడుతున్నారు నటులు. అందుకే ఒకప్పుడు కేవలం సీనియర్ హీరోలతోనే సినిమాలు తెరకెక్కించే స్టార్ డైరెక్టర్లు కూడా యంగ్ హీరోల కాల్ షీట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా యంగ్ హీరో రామ్ స్టార్ డైరెక్టర్లతోనే వరుసగా సినిమాలు ఓకే చేస్తూ వెళ్తున్నాడు.

ఒకప్పుడు హీరో రామ్ పేరు చెప్పగానే చాక్లెట్ బాయ్ ఇమేజ్ గుర్తొచ్చేది. కానీ 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత ఆ ఇమేజ్ నుండి పూర్తిగా బయటికి వచ్చేశాడు రామ్. రఫ్ లుక్స్‌తో, మాస్ రోల్స్ చేస్తూ ప్రయోగాల వైపే అడుగులేస్తున్నాడు. ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామితో రామ్ చేస్తున్న 'ది వారియర్'లో కూడా ఓ రఫ్ అండ్ టప్ పోలీస్ ఆఫీసర్‌లాగా మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. ఇంతలోనే మరో ప్రయోగానికి సిద్ధమయ్యాడు రామ్.

ది వారియర్ తర్వాత టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటితో రామ్ సినిమా ఉండబోతుందని తెలిసిన విషయమే. అయితే దీని తర్వాత హరీష్ శంకర్‌తో రామ్ మూవీ ఉండనుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌, సల్మాన్ ఖాన్‌ లాంటి స్టార్ హీరోలతో చిత్రాలను ప్లాన్ చేసుకున్నాడు హరీష్. ఇక దీని తర్వాత రామ్‌తో మూవీ ఉండబోతుందని సమాచారం. రామ్ చేసే ఈ ప్రయోగాలు తనకు ఏ మాత్రం హిట్ ఇస్తాయో చూడాలి.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES