Ram Pothineni: త్వరలోనే చాక్లెట్ బాయ్ రామ్ లవ్ మ్యారేజ్.. అనౌన్స్‌మెంట్‌కు సిద్ధం..

Ram Pothineni: తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది యంగ్ హీరోలు ఉన్నారు. వారిలో చాక్లెట్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు రామ్ పోతినేని. ఇప్పుడిప్పుడే ఈ చాక్లెట్ బాయ్ ఇమేజ్ నుండి బయటికి వచ్చి కమర్షియల్, మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదే సమయంలో రామ్.. పెళ్లికొడుకు కాబోతున్నాడన్న వార్త సినీ సర్కిల్లో గుప్పుమంది.
'ఇస్మార్ట్ శంకర్' తర్వాత రామ్ స్క్రిప్ట్ సెలక్షనే మారిపోయింది. ప్రస్తుతం లింగుసామితో రామ్ చేస్తున్న 'ది వారియర్' కూడా కమర్షియల్ సినిమానే. ఈ మూవీ జులై 14న విడుదలకు సన్నాహాలు చేస్తుండడంతో టీమ్ అంతా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. తెలుగుతో పాటు తమిళంలో రిలీజ్ కానున్న ది వారియర్ కోసం మూవీ టీమ్ హైదరాబాద్‌లోనే కాదు చెన్నైలో కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు.
ఇదే సమయంలో రామ్ పెళ్లి వార్త బయటికి వచ్చింది. రామ్ చిన్నప్పటి క్లాస్‌మేట్‌తో ప్రేమలో ఉన్నాడని.. ఇన్నాళ్లకు ఇంట్లో వారిని ఒప్పించి తనను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడని సమాచారం. ది వారియర్ మూవీ విడుదలయ్యాక ఎంగేజ్‌మెంట్ గురించి అనౌన్స్‌మెంట్ కూడా ఇవ్వనున్నాడట. పెళ్లి గురించి అన్నీ ముందే ప్లాన్ కూడా చేసి పెట్టుకున్నాడట ఈ యంగ్ హీరో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com