టాలీవుడ్

Ram Pothineni: డైరెక్టర్‌‌కు సారీ చెప్పిన రామ్.. ఇంతకీ తను చేసిన తప్పేంటి..?

Ram Pothineni: రామ్, కృతి శెట్టి జంటగా నటిస్తున్న ది వారియర్ తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా విడుదల కానుంది.

Ram Pothineni: డైరెక్టర్‌‌కు సారీ చెప్పిన రామ్.. ఇంతకీ తను చేసిన తప్పేంటి..?
X

Ram Pothineni: చాక్లెట్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న రామ్.. ఇప్పుడు పూర్తిగా మాస్ హీరో ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. కేవలం ప్రేమకథలు, ఫ్యామిలీ చిత్రాలలో నటించిన రామ్.. 'ఇస్మార్ట్ శంకర్'తో పూర్తిగా రూటు మార్చేశాడు. ఇప్పుడు మరోసారి 'ది వారియర్'గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటీవల తమ సినిమా సాంగ్ లాంచ్ వేడుకలో రామ్.. తమ డైరెక్టర్ పేరును మర్చిపోవడానికి చర్చనీయాంశంగా మారింది.


రామ్, కృతి శెట్టి జంటగా నటిస్తున్న ది వారియర్ చిత్రం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా విడుదల కానుంది. అయితే ఈ మూవీకి డైరెక్టర్ లింగుసామి కావడంతో తమిళంలో ఆటోమేటిక్‌గా దీనిపై అంచనాలు పెరిగిపోయాయి. అంతే కాకుండా ఇప్పటికే విడుదలయిన 'బుల్లెట్' సాంగ్ కూడా రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇదే సంతోషంలో విజిల్ అనే మరో పాటను లాంచ్ చేసింది మూవీ టీమ్.

ది వారియర్ చిత్రం నుండి విజిల్ పాటను హీరో సూర్య లాంచ్ చేశాడు. ఈ లాంచ్ వేడుకలో మూవీ టీమ్ అంతా పాల్గొంది. అయితే స్టేజ్‌పై ఈ సినిమా యూనిట్ అందరికీ ధన్యవాదాలు చెప్పుకున్న రామ్.. డైరెక్టర్ లింగుసామి పేరు మాత్రం మర్చిపోయాడు. దీంతో ఇండస్ట్రీలో ఇది చర్చనీయాంశంగా మారింది. ఇది గమనించిన రామ్.. వెంటనే ఓ ట్వీట్‌తో లింగుసామికి క్షమాపణ చెప్పాడు.

'చివర్లో, ఆ హడావిడిలో మెయిన్ మ్యాన్ గురించి చెప్పడం మర్చిపోయాను. నా వారియర్, నా డైరెక్టర్ లింగుసామి సార్. ఈ సినిమాలోని ప్రతీ ఫ్రేమ్‌ను మీ భుజాలపై మోశారు సార్. నేను పనిచేసిన బెస్ట్ డైరెక్టర్లలో మీరు కూడా ఒకరు. సారీ, లవ్యూ' అని ట్వీట్ చేశాడు రామ్. అయినా కూడా రామ్.. లింగుసామి పేరు స్టేజ్‌పై చెప్పలేదు అని విషయన్ని ప్రేక్షకులు మర్చిపోలేదు.


Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES