Ram Pothineni: గర్ల్‌ఫ్రెండ్‌తో పెళ్లి.. స్పందించిన హీరో రామ్..

Ram Pothineni: గర్ల్‌ఫ్రెండ్‌తో పెళ్లి.. స్పందించిన హీరో రామ్..
Ram Pothineni: రామ్.. తన హైస్కూల్ క్లాస్‌మేట్‌ను ప్రేమిస్తున్నాడని, పెళ్లి కూడా చేసుకోనున్నాడని వార్తలు వైరల్ అయ్యాయి.

Ram Pothineni: తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది యంగ్ హీరోలు ఉన్నారు. వారిలో చాక్లెట్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు రామ్ పోతినేని. ఇప్పుడిప్పుడే ఈ చాక్లెట్ బాయ్ ఇమేజ్ నుండి బయటికి వచ్చి కమర్షియల్, మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదే సమయంలో రామ్.. పెళ్లికొడుకు కాబోతున్నాడన్న వార్త సినీ సర్కిల్లో గుప్పుమంది.

రామ్.. తన హైస్కూల్ క్లాస్‌మేట్‌ను ప్రేమిస్తున్నాడని, ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి కూడా చేసుకోనున్నాడని వార్తలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ది వారియర్ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న రామ్.. ఆ సినిమా విడుదల తర్వాత ఎంగేజ్‌మెంట్ గురించి ప్రకటించనున్నాడని కూడా రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా రామ్.. ఈ వార్తలపై సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.

'ఓరి దేవుడా ఆపండి. నేను ఏ సీక్రెట్ హై స్కూల్ స్వీ్ట్ హార్ట్‌ను పెళ్లి చేసుకోవడం లేదని నా సొంత ఫ్యామిలీని, ఫ్రెండ్స్‌ను నమ్మించాల్సిన స్థాయికి చేరిపోయింది. నిజం చెప్పాలంటే నేను అసలు హై స్కూల్‌కు పెద్దగా వెళ్లలేదు.' అని రామ్ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. దీంతో రామ్‌కు త్వరలోనే పెళ్లి అనే వార్తలకు చెక్ పడింది. ఇక రామ్ నటించిన ది వారియర్ జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags

Read MoreRead Less
Next Story