రామరాజు ఫర్ భీమ్ టీజర్ వచ్చేసిందోచ్..

రామరాజు ఫర్ భీమ్.. ఈ టీజర్ కోసం కోట్ల మంది ఎదురుచూస్తున్నారు. ఈ టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ఎంతో ఆసక్తితో ఉన్నారు. టీజర్ రానే వచ్చింది. రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ పై ప్రత్యేకంగా రూపొందించిన టీజర్ ఇది.. గతంలో రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చిన వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు లాంటి పవర్‌ఫుల్ పాత్రలో చెర్రీ బాడి షేపింగ్ తో.. అద్బుతమైన విజువల్స్ తో.. తారక్ వాయిస్ ఓవర్ తో టీజర్ రిలీజ్ చేశారు.
తాజాగా కొమరం భీమ్ టీజర్ రిలీజ్ చేశారు. అయితే ఈ సారి రామ్‌చరణ్ వాయిస్ ఓవర్ తో కొమరం భీం టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో కొమరం భీమ్‌గా తారక్ ఎంట్రీ సూపర్ గా ఉంది.
అల్లూరి సీతారామరాజు టీజర్ లో తారక్ వాయిస్ ఇప్పించి ఇద్దరి హీరోలకి న్యాయం చేశారు. ఇప్పుడు కొమరం భీమ్ టీజర్ లో తారక్ విజువల్స్ తో చెర్రీతో వాయిస్ చెప్పించారు. చెర్రీ, తారక్ పాత్రలు సమానంగా సమరంగా ఉండేలా పాన్లు చేసిన.. జక్కన్న తెలివితేటలని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
Finally, here's the mighty Bheem!
— Ram Charan (@AlwaysRamCharan) October 22, 2020
A befitting return gift to you my dear brother @tarak9999!https://t.co/dsTSC7QoBO@ssrajamouli @RRRMovie #RamarajuForBheem #RRRMovie #BheemFirstLook
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com