తల్లిదండ్రులైన రామ్ చరణ్, ఉపాసన

తల్లిదండ్రులైన  రామ్ చరణ్, ఉపాసన
మెగా సంబరాలు షురూ

మెగా కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చ‌ర‌ణ్ తండ్రి అయ్యారు . ఆయ‌న భార్య ఉపాస‌న మంగ‌ళ‌వారం ఉద‌యం పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. సోమవారం ఆసుపత్రిలో చేరిన ఉపాసనకు మంగళవారం తెల్లవారు జామున అంటే జూన్ 20న ఆడబిడ్డ పుట్టినట్లు జూబ్లీహిల్స్‌లో ని అపోలో హాస్పిటల్‌ మెడికల్ బులెటిన్ ద్వారా ధృవీకరించింది. ఈ న్యూస్ తో కొణిదెల, కామినేని కుటుంబాలు ఆనందంలో మునిగిపోయాయి.

త‌ల్లీబిడ్డ‌ ఉద్ద‌రు క్షేమంగా ఉన్న‌ట్లు అపోలో ఆసుప‌త్రి వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. మెగా హీరో రామ్ చరణ్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి, ఒక్కో సినిమాతో ఎదుగుతూ తండ్రి పేరు నిలబెట్టాడు. చిరుత మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా హీరో రేంజ్ కి ఎదిగాడు. పెద్దల అనుమతితో ప్రేమించిన ఉపాసన ను 2012లో పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్నట్టు మెగా, కామినేని కుటుంబాలు గత నవంబర్ న వెల్లడించాయి. తరువాత దుబాయ్ లో ఉపాసన బేబీ షవర్ ఆమె స్నేహితులు కుటుంబ సభ్యులు మధ్య జరిగింది. తర్వాత మరోసారి జరిగిన శ్రీమంతానికి హైదరాబాద్లో కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ తారలు హాజరయ్యారు.

డెలివరీ కి ముందుగా కొద్ది రోజుల క్రితమే రామ్ చరణ్ దంపతులు తమ ఇంటి నుంచి చిరంజీవి ఇంటికి షిఫ్ట్ అయ్యారు. సాధారణంగా ఎవరైనా దంపతులు పిల్లలు పుట్టిన తర్వాత వేరు కాపురం పెడుతుంటారని, తాము దానికి పూర్తి భిన్నమని ఉపాసన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం తాము విడిగా ఉంటున్నామని, అయితే బిడ్డ పుట్టిన తర్వాత మాత్రం అత్తమామలతోనే ఉండాలని నిర్ణయించుకున్నామని ఉపాసన తెలిపారు. తమ ఎదుగుదలలో గ్రాండ్​ పేరెంట్స్ కీలక పాత్ర పోషించారని, తాతయ్యతో ఉన్నప్పుడు పిల్లలకు కలిగే ఆనందాన్ని తమ బిడ్డకు దూరం చేయాలనుకోవాలని లేదని చెప్పారు.

ప్రస్తుతం మెగా హీరో రామ్ చరణ్ వరుస సినిమాల తో బిజీగా ఉన్నారు.. శంకర్ దర్శకత్వం లో గేమ్ చేంజర్ సినిమా లో నటిస్తున్నారు.. అలాగే మరో రెండు ప్రాజెక్టు లలో నటిస్తున్నారు..

Tags

Read MoreRead Less
Next Story