RamCharan On Nepotism: నెపోటిజంపై స్పందించిన రామ్ చరణ్...

దేశ వ్యాప్తంగా నెపోటిజంపై మరోసారి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆస్కార్ లో విజయకేతనం ఎగురవేసి తిరిగి వచ్చిన రామ్ చరణ్ కూ ఈ ప్రశ్న ఎదురైంది. అయితే తనపై సంధించిన ప్రశ్నను తప్పించుకోకుండా చెర్రీ హుందాగా సమాధానమిచ్చాడు. నెపోటిజాన్ని నమ్ముకుని ఇండస్ట్రీలోకి వచ్చినట్లైతే తాను 14ఏళ్లుగా రాణించలేకపోయి ఉండేవాడినని చరణ్ వ్యాఖ్యానించాడు. తన పనితనం బాగుంది కాబట్టి, ఇండస్ట్రీలో తనని అందరూ ఆదరిస్తున్నారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి తనకు చేసిన తొలి సూచన గురించి తెలిపాడు. తొలి రోజు సెట్స్ కు వచ్చిన చిరు... తన చుట్టూ ఉన్నవారి పట్ల మర్యాదగా వ్యవహరించాల్సిందిగా తెలిపారట. అడుగడుగునా వారే తోడుంటారని, అలాంటి వారు తన గురించి మాట్లాడటం మొదలుపెట్టారంటే మంచిది కాదని తెలిపారట. ఇప్పటికీ అదే సూత్రాన్ని తాను ఫాలో అవుతుంటానని చెర్రీ తెలిపాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com