Rana Daggubati: నాగచైతన్యపై రానా కామెంట్స్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్..

Rana Daggubati: అక్కినేని హీరోలతో రానా చాలా క్లోజ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఒకరి సినిమాకు ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారన్నది కూడా కామన్. అదే విధంగా తాజాగా విడుదలయిన నాగచైతన్య 'థాంక్యూ' టీజర్‌పై రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అసలు ఈ కామెంట్స్ వెనుక అర్థమేంటి అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఇప్పటికే నాగచైతన్య 'మనం' అనే చిత్రంలో నటించాడు. కేవలం నాగచైతన్యకే కాదు.. మొత్తం అక్కినేని ఫ్యామిలీకే మనం మూవీ చాలా స్పెషల్. అందుకే అక్కినేని హీరోలు ఒకరి తర్వాత ఒకరు విక్రమ్‌కు మళ్లీ ఛాన్స్ ఇస్తున్నారు. అలా విక్రమ్, నాగచైతన్య కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'థాంక్యూ'. ఇటీవల విడుదలయిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
'నన్ను నేను సరిచేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయాణమే థాంక్యూ' అన్న క్యాప్షన్‌తో నాగచైతన్య థాంక్యూ టీజర్‌ను తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. అయితే దీనికి కామెంట్‌గా 'నువ్వు ఆల్రెడీ సరి అయిపోయావు బ్రదర్' అన్నాడు రానా. అయితే రానా అన్న ఈ మాటలకు ఈ అర్థమేంటి అని సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇప్పటికే థాంక్యూ టీజర్‌లో చాలావరకు డైలాగ్స్ ఎవరినో ఉద్దేశించినట్టుగా ఉన్నాయని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
Nuvvu already sari aiyipoyyavu brother 😝 superb teaser guy! Best wishes @Vikram_K_Kumar @RaashiiKhanna_ https://t.co/9s6qhMpLCx
— Rana Daggubati (@RanaDaggubati) May 26, 2022
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com