Rana Daggubati: సోషల్ మీడియా పోస్ట్‌తో ఫ్యాన్స్‌కు షాకిచ్చిన రానా..

Rana Daggubati: ఒక హీరోగా మాత్రమే కాదు ఒక నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు దగ్గుబాటి హీరో రానా. కెరీర్ మొదట్లోనే తెలుగుతో పాటు పలు చిత్రాల్లో నటించాడు. ఓవైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు పాన్ ఇండియా సినిమా 'బాహుబలి'లో విలన్ రోల్ చేశాడు. ఇక సినిమా సినిమాకు తనలోని నటుడిని పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే ఉన్నారు రానా. ఇక ఈ హీరో తాజాగా ఓ సోషల్ మీడియా పోస్ట్‌తో ఫ్యాన్స్‌కు షాకిచ్చాడు.
వేణు ఊడుగుల దర్శకత్వంలో చేసిన 'విరాటపర్వం'తో చివరిసారి ప్రేక్షకులను పలకరించాడు రానా. ఈ సినిమాలో ఓ కామ్రేడ్‌గా నటించి మెప్పించాడు. ఇక ఈ మూవీ రిలీజ్ సమయంలో ఇదే తన చివరి ప్రయోగం అని, ఇకపై తన ఫ్యాన్స్‌ను హ్యాపీ చేసే సినిమాలను తెరకెక్కిస్తానని మాటిచ్చాడు కూడా. కానీ ఇప్పుడు తన తరువాతి చిత్రాల గురించి ఎలాంటి క్లారిటీ లేదు.
ప్రస్తుతం రానా ఎవరితో సినిమా చేస్తున్నాడు. షూటింగ్ మొదలయ్యిందా లేదా, బ్రేక్ తీసుకొని రిలాక్స్ అవుతున్నాడా.. ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. ఇంతలోనే రానా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. 'ప్రస్తుతం పని జరుగుతోంది. సోషల్ మీడియా నుండి చిన్న బ్రేక్ తీసుకోనున్నాను. థియేటర్లలో కలుద్దాం. ప్రేమతో రానా' అంటూ సోషల్ మీడియాకు తాత్కాలికంగా దూరమవుతున్నట్టు ప్రకటించాడు.
— Rana Daggubati (@RanaDaggubati) August 5, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com