31 Oct 2020 8:54 AM GMT

Home
 / 
సినిమా / టాలీవుడ్ / ప్రదీప్, రష్మిలకు...

ప్రదీప్, రష్మిలకు అరుదైన ఘనత..

స్ఫూర్తివంతుల జాబితాలో చోటు సంపాదించారు.

ప్రదీప్, రష్మిలకు అరుదైన ఘనత..
X

బుల్లి తెర ప్రేక్షకులకు ప్రియమైన యాంకర్లు ప్రదీప్ మాచిరాజు, రష్మీ గౌతమ్.. అరుదైన ఘనతను సాధించారు. ప్రముఖ బ్రిటన్ జర్నలిస్టు కిరణ్ రాయ్ 400 మంది స్ఫూర్తివంతుల జాబితాలో చోటు సంపాదించారు. ఆసియాలోని భారత్, పాకిస్థాన్, అఫ్గానిస్తాన్ దేశాల్లోని పలువురు ప్రముఖులను ఈ జాబితాలో ఎంపిక చేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ ఈ జాబితాలో అగ్ర స్థానంలో నిలిచారు.

అలాగే సోనూ నిగమ్, రహత్ ఫతే అలీ, అద్నాన్ సమీ, జాకీర్ హుస్సేన్ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. ప్రతిభావంతుల జాబితాలో తమకీ స్థానం దక్కడం ఆనందాన్నిచ్చిందని రష్మీ, ప్రదీప్ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. కిరణ్ రాయ్ స్వయంగా ఇంటర్వ్యూలు చేసి ఎంపిక చేసినట్లు వీరు తెలిపారు. ఈ జాబితాలో మొత్తం 230 మంది భారతీయ ప్రముఖలు ఉన్నారు.

Next Story