టాలీవుడ్

Rashmi Gautam: 'జబర్దస్త్'కు త్వరలో కొత్త యాంకర్.. కన్ఫర్మ్ చేసిన రష్మీ.

Rashmi Gautam: అనసూయ స్థానంలో జబర్దస్త్‌కు కొత్త యాంకర్ వస్తుంది అనుకున్నారంతా.

Rashmi Gautam: జబర్దస్త్కు త్వరలో కొత్త యాంకర్.. కన్ఫర్మ్ చేసిన రష్మీ.
X

Rashmi Gautam: తెలుగులో స్టాండప్ కామెడీ షోల ఫేట్‌నే మార్చేసింది 'జబర్దస్త్'. వారానికి ఒకసారి టెలికాస్ట్ అవుతున్నా కూడా ఎన్నో సంవత్సరాలుగా ఈ షో ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అందుకే ఇందులో ఏ చిన్న మార్పు అయినా ప్రేక్షకులు దీని గురించి ఎక్కువగా చర్చిస్తారు. తాజాగా ఈ షోలో యాంకర్ మారిపోతుందన్న విషయం కూడా సంచలనంగా మారడమే దీనికి ఉదాహరణ. అయితే ఈ విషయంపై రష్మీ మొదటిసారి నోరువిప్పింది.

ముందుగా జబర్దస్త్ షో అనసూయతోనే ప్రారంభమయ్యింది. కొంతకాలంలోనే ఈ షోకు ఎనలేని క్రేజ్ వచ్చింది. కానీ అప్పటికే అనసూయ స్థానంలో రష్మీ ఎంట్రీ ఇచ్చేసింది. అప్పుడే ఎక్స్‌ట్రా జబర్దస్త్ అని మరో షోను ప్రారంభించినా.. దానికి కూడా రష్మీనే యాంకర్‌గడా వ్యవహరించింది. కొన్నాళ్ల తర్వాత మళ్లీ అనసూయ రీ ఎంట్రీ ఇచ్చింది. ఓవైపు సినిమాలను, మరోవైపు జబర్దస్త్‌ను మ్యానేజ్ చేస్తూ వచ్చిన అనసూయ.. ఇటీవల ఈ షో నుండి తప్పుకుంది. అనసూయ స్థానంలో జబర్దస్త్‌కు కొత్త యాంకర్ వస్తుంది అనుకున్నారంతా.

అంతే కాకుండా దీనికోసం పలువురు యాంకర్ పేర్లు కూడా వినిపించాయి. కానీ అనూహ్యంగా ఆ ఎపిసోడ్‌కు కూడా రష్మీనే యాంకర్‌గా వచ్చి షాకిచ్చింది. కానీ ఆ తర్వాత 'జబర్దస్త్‌లోకి మళ్లీ ఆహ్మానించినందుకు థాంక్యూ. నేను అప్పుడైనా, ఇప్పుడైనా షోకు అవసరం ఉన్నప్పుడు కచ్చితంగా అందుబాటులో ఉంటాను. రిప్లేస్‌మెంట్ దొరికే వరకు యాంకర్‌గా ఉండడం నాకు సంతోషంగా ఉంది. అప్పటివరకు ప్లీజ్ నన్ను భరించండి'. అంటూ పోస్ట్ చేసింది రష్మీ. దీంతో జబర్దస్త్‌కు కొత్త యాంకర్ రావడం మాత్రం పక్కా అని క్లారిటీ వచ్చింది.


Next Story

RELATED STORIES