Rashmi Gautam: 'ఇండియాలో ఇదీ పరిస్థితి'.. యాంకర్ రష్మీ సెన్సేషనల్ కామెంట్స్..

Rashmi Gautam: టాలీవుడ్‌లో వెండితెరపై నటించే నటీనటులకు ఎంత పేరు వస్తుందో.. కొందరు బుల్లితెర యాంకర్స్ కూడా వారికి సమానంగా క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఎంతోమంది కొత్త యాంకర్స్ పుట్టుకొస్తున్న ఆ పోటీని తట్టుకొని కొందరు.. తమకంటూ ఓ స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. అందులో ఒకరు యాంకర్ రష్మీ. ఇటీవల ఓ విషయంపై రష్మీ చేసిన కామెంట్స్ సెన్సేషనల్ అవుతున్నాయి.
లాక్‌డౌన్ సమయంలో తిండి దొరకక.. ఆకలితో అలమటించిపోయిన వారు ఎందరో ఉన్నారు. అయితే మనుషులకు మాత్రమే కాదు మూగజీవాలకు కూడా ఆకలి ఉంటుందని చాలామంది రోడ్డుపై ఉండే కుక్కలకు ఆహారం పెట్టడం మొదలుపెట్టారు. అలాంటి వారిలో యాంకర్ రష్మీ కూడా ఒకరు. అప్పటినుండి రష్మీకి మూగజీవాలంటే ఎంత ఇష్టమో అందరికీ అర్థమయ్యింది.
తాజాగా ఓ ఆవును తాడుతో కట్టి ఈడ్చుకెళ్తున్న వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మీ. 'ఆవును గోమాత అని పిలిచే ఇండియాలో ఇంతకంటే దరిద్రం ఉండదు. జంతు చర్మంతో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేసేముందు ఒక్కసారి కూడా ఆలోచించము. అలాంటి వస్తువులకు దూరంగా ఉందాం. మీకు పాలు ఎక్కడ నుండి వస్తున్నాయో మర్చిపోకండి' అని క్యాప్షన్ పెట్టింది రష్మీ. దీంతో తను చేసిన ఈ కామెంట్స్ సెన్సేషనల్ అవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com