బాబోయ్.. రష్మిక అప్పుడే అంత ఆస్తి సంపాదించిందా?

బాబోయ్..  రష్మిక అప్పుడే  అంత ఆస్తి సంపాదించిందా?
ఛలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి వరుస సక్సెస్ లతో టాప్ హీరోయిన్ గా ఎదిగింది హీరోయిన్ రష్మిక మందన్నా..

ఛలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి వరుస సక్సెస్ లతో టాప్ హీరోయిన్ గా ఎదిగింది హీరోయిన్ రష్మిక మందన్నా.. కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు తమిళం, హిందీ, కన్నడ భాషల్లో నటిస్తూ అంతటా ప్రేక్షకులను తన బుట్టలో వేసుకుంటోందీ బ్యూటీ. ఇదిలా ఉంటే తాజాగా ఈ హీరోయిన్‌ ఆస్తుల గురించి సోషల్ మీడియా న్యూస్ చక్కర్లు కొడుతుంది. రష్మిక గ్యారేజీలో ఆడి క్యూ 3, మెర్సిడిస్‌ బెంజ్‌ సీ క్లాస్‌, రేంజ్‌ రోవర్‌ ఎస్‌యూవీ, ఇన్నోవా క్రిస్టా, హ్యుండాయ్‌ క్రెటా వంటి ఖరీదైన కార్లు ఉన్నాయట.

ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న ఈ బ్యూటీ.. ముంబైలో సొంతంగా ఇల్లు కూడా కొనుక్కుంది. ఇప్పటికే బెంగళూరులోనూ ఓ పెద్ద బంగ్లా ఉండగా రూ.6-8 కోట్లు విలువ చేసే సొంత విల్లా కూడా ఉంది. హైదరాబాద్ లో కూడా ఓ ప్లాట్ ఉంది. ఇక రష్మికకు హ్యాండ్‌ బ్యాగ్స్‌ అంటే చాలా ఇష్టమట.. వీటికోసం ఆమె లక్షల్లోనే ఖర్చుపెడుతుంది. తన కాస్ట్యూమ్స్‌ కోసం కూడా బాగానే ఖర్చు చేస్తుందట. కాగా రష్మిక ప్రస్తుతం రెండున్నర కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప, అమితాబ్‌ బచ్చన్‌తో గుడ్‌బై సినిమాలను చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story