Ravi Teja: షూటింగ్‌లో రవితేజకు ప్రమాదం.. తీవ్ర గాయాలు..

Ravi Teja: చేతినిండా సినిమాలతో బిజీ అయిన టాలీవుడ్ హీరోల్లో రవితేజ కూడా ఒకరు. దాదాపు ఒకేసారి అరడజను సినిమాలతో బిజీగా ఉన్నాడు మాస్ మహారాజా. ఒకటి తర్వాత ఒకటి చిత్రాలను ప్రారంభిస్తూ.. అన్ని షూటింగ్స్‌ను ఒకేసారి మ్యానేజ్ చేస్తు్న్నాడు ఈ హీరో. ప్రస్తుతం రవితేజ 'టైగర్ నాగేశ్వర రావు' చిత్ర షూటింగ్‌లో గాయపడినట్టు టాక్ వినిపిస్తోంది.
రవితేజ ఇప్పటివరకు తన కెరీర్‌లో ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లోనే నటించాడు. కానీ ఇకపై తను సెలక్ట్ చేసుకుంటున్న కథలన్నీ కాస్త భిన్నంగా ఉన్నట్టు అర్థమవుతోంది. అందుకే గజదొంగ అయిన నాగేశ్వర రావు జీవితకథ ఆధారంగా 'టైగర్ నాగేశ్వర రావు' సినిమాను చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్‌లో రవితేజకు ప్రమాదం జరిగిందని, తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. అయినా కూడా ఆయన బ్రేక్ తీసుకోకుండా షూటింగ్‌కు రావాలని నిర్ణయించుకున్నాడట. దాని వెనుక ఓ బలమైన కారణం ఉందట.
షూటింగ్‌లో ఒక తాడుతో స్టంట్ చేస్తుండగా రవితేజకు ప్రమాదం జరిగిందని సమాచారం. ఈ ఘటన జరిగి కొన్నిరోజులు అవుతున్నా.. ఇప్పుడే బయటపడింది. ఆ తర్వాత వెంటనే రవితేజను ఆసుపత్రికి తరలించగా.. తనకు 10 కుట్లు కూడా పడ్డాయని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయినా కూడా విశ్రాంతి తీసుకోకుండా రవితేజ షూటింగ్‌కు హాజరవుతున్నారట. స్టంట్ మాస్టర్ పీటల్ హెయిన్స్ డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ఇప్పుడే యాక్షన్ సీన్స్‌ను పూర్తి చేయాలని రవితేజ నిర్ణయించుకున్నారట. ఇది విన్న అభిమానులు మరోసారి రవితేజ డెడికేషన్‌కు ఫిదా అవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com