Ravi Teja: త్వరలోనే స్క్రీన్‌పై మాస్ మహారాజ్ వారసుడు..

Ravi Teja: ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగిన వారు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వారిలో మాస్ మహారాజ్ రవితేజ.. ఓ సెపరేట్ మార్క్‌నే క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటికీ ఎంతోమంది బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న నటులకు రవితేజనే ఇన్‌స్పిరేషన్. ఇప్పుడు ఈ హీరో.. తన వారసుడిని ఇండస్ట్రీలోకి దించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. కానీ ఆ వారసుడు.. తన సొంత కుమారుడు కాదు.
రవితేజకు ఒక కొడుకు ఉన్నాడు. ఇప్పటికే రవితేజ హీరోగా నటించిన 'రాజా ది గ్రేట్' ద్వారా తన తనయుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో రవితేజ వారసుడిగా తనే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నాడని అనుకున్నారంతా. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. తన సోదరుడి కుమారుడిని హీరోగా లాంచ్ చేయడానికి రవితేజ సన్నాహాలు చేస్తున్నాడట. అంతే కాకుండా దీనికోసం ఓ డైరెక్టర్‌ను కూడా చూసిపెట్టినట్టు సమాచారం.
రవితేజ తమ్ముని కొడుకు మాధవన్ హీరోగా లాంచ్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు సమాచారం. అయితే రవితేజతో కలిసి వీర, ఖిలాడి వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రమేశ్ వర్మకు మాధవన్ బాధ్యతలు అప్పగించాడట రవితేజ. తనతో చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా రమేశ్ వర్మ తనకు మంచి స్నేహితుడు కావడంతో రమేశ్ వర్మకే ఈ ఛాన్స్ ఇచ్చాడంటూ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com