Ravi Teja: ఆ భారీ బడ్జెట్ చిత్రానికి నో చెప్పిన రవితేజ.. అందుకే నందమూరి హీరోతో..

Ravi Teja: ఆ భారీ బడ్జెట్ చిత్రానికి నో చెప్పిన రవితేజ.. అందుకే నందమూరి హీరోతో..
Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ రెండు హిట్లు, నాలుగు ఫ్లాపులుగా సాగుతోంది.

Ravi Teja: మామూలుగా ఓ సినిమా కథ ఒక హీరో కోసం రాసుకుంటే అది ఇంకొక హీరోకు నచ్చడం.. వారితోనే ఆ సినిమా తెరకెక్కడం.. ఇండస్ట్రీలో చాలా కామన్‌గా జరిగేదే. అయితే కొన్నిసార్లు భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా చిత్రాలు కూడా ఒక హీరో నుండి మరో దగ్గరకు వెళ్తాయి. అలా రవితేజ వద్దనుకున్న ఓ భారీ బడ్జెట్ చిత్రం.. నందమూరి హీరో చేతికి వెళ్లిందని సమాచారం.

మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ రెండు హిట్లు, నాలుగు ఫ్లాపులుగా సాగుతోంది. ఒక మూవీ సూపర్ హిట్ అందుకుంటే.. ఆ తర్వాత కొన్నాళ్ల వరకు రవితేజ నటించిన ఏ సినిమాకు కూడా హిట్ టాక్ రావడం లేదు. అందుకే రవితేజ ఆశలన్నీ 'రామారావు ఆన్ డ్యూటీ'పైనే ఉన్నాయి. శరత్ మండవ తెరకెక్కించిన రామారావు ఆన్ డ్యూటీ.. జులై 29న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

అయితే నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'బింబిసార' చిత్రం కథను ముందుగా రవితేజకు వినిపించాడట దర్శకుడు మల్లిడి వశిష్ట. దాంతో పాటు మరో కథ కూడా వినిపించాడట. కానీ రవితేజకు రెండు కథలు నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారని టాక్. కళ్యాణ్ రామ్ కంటే ముందు మరికొందరు హీరోల దగ్గరకు కూడా బింబిసార కథ వెళ్లిందట. కానీ ఫైనల్‌గా అది ఆ నందమూరి హీరో చేతిలోకి వెళ్లి.. తన కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది.



Tags

Read MoreRead Less
Next Story