Ravi Teja: అరడజను సినిమాలతో రవితేజ.. మరో మూవీకి గ్రీన్ సిగ్నల్..

Ravi Teja: అరడజను సినిమాలతో రవితేజ.. మరో మూవీకి గ్రీన్ సిగ్నల్..
Ravi Teja: రవితేజ.. ప్రభుత్వ ఉద్యోగిగా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

Ravi Teja: ప్రస్తుతం సినిమాలు సైన్ చేసే విషయంలో హీరోలు చాలా స్పీడ్ చూపిస్తున్నారు. ఇక పలు కారణాల వల్ల తాము నటించిన సినిమాలు కొన్నిసార్లు అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు రాలేకపోయినా.. వారు మాత్రం కథలను ఓకే చేయడం ఆపడం లేదు. అలాంటి కేటగిరిలో ఉన్న సీనియర్ హీరో మాస్ మహారాజ్ రవితేజ. ఇటీవల రవితేజ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

రవితేజ.. ప్రభుత్వ ఉద్యోగిగా నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి అవ్వకపోవడంతో వాయిదా పడింది. ఇక రామారావు ఆన్ డ్యూటీతో పాటు 'రావనాసుర', 'టైగర్ నాగేశ్వర రావు', 'ధమాకా' వంటి చిత్రాల షూటింగ్స్‌లో కూడా ఒకేసారి పాల్గొంటున్నాడు రవితేజ. ఇంతలోనే తను మరో కథను ఓకే చేసినట్టు టాక్ వినిపిస్తోంది.

యాంకర్ ప్రదీప్‌ను హీరోగా పరిచయం చేస్తూ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు మున్నా. ఈ సినిమా యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కినా కమర్షియల్‌గా అంతగా సక్సెస్ కాలేకపోయింది. అయితే మున్నా చెప్పిన ఓ రొమాంటిక్ కామెడీ కథను రవితేజ ఓకే చేశారట. అంతే కాకుండా ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ.. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకోనున్నట్టు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story