Mega 154: చిరు మూవీ నుండి తప్పుకున్న రవితేజ.. ఆ ప్లేస్‌లో మరో స్టార్ హీరో..

Mega 154: చిరు మూవీ నుండి తప్పుకున్న రవితేజ.. ఆ ప్లేస్‌లో మరో స్టార్ హీరో..
Mega 154: ఈ మూవీకి ఇప్పటికే 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది.

Mega 154: మల్టీ స్టారర్ మూవీలకు టాలీవుడ్‌లో చాలా క్రేజ్ ఉంది. మన స్టార్లు మల్టీ స్టారర్లు సినిమా చేయడం చాలా తక్కువ. అందుకే ప్రేక్షకులు తెలుగులో మల్టీ స్టారర్ చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' భారీ అంచనాల మధ్య విడుదలయ్యి ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో తన తరువాతి సినిమాలతో ఎలాగైనా హిట్ కొట్టాలి అనుకుంటున్న చిరు అప్‌కమింగ్ మూవీకి మరో బ్రేక్ పడింది.

చిరంజీవి ప్రస్తుతం దాదాపు అరడజను సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకటి తర్వాత ఒకటి షూటింగ్ చేసుకుంటూ వాటిని అనుకున్న సమయానికే విడుదల చేయాలని విరామం లేకుండా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న సినిమాలు పూర్తయిన తర్వాత చిరు.. బాబీ డైరెక్షన్‌లో చేసే మూవీని ప్రారంభించనున్నాడు. ఈ మూవీకి ఇప్పటికే 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఇందులో చిరంజీవితో పాటు మాస్ మహారాజ్ రవితేజ స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి ఉంది.

రవితేజ కూడా చిరంజీవిలాగానే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. పైగా బాబీ, చిరు మూవీ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో క్లారిటీ లేకపోవడంతో రవితేజ.. ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారట. రవితేజ ప్లేస్‌లో మరో స్టార్ హీరోను క్యాస్ట్ చేయడం కోసం బాబీ అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం. చిరంజీవి, రవితేజ కాంబినేషన్‌లో సినిమా అనగానే ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్‌గా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్‌లో ఇంకే హీరో వస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story