Repeated Titles.. ఒకే టైటిల్ ఇన్ని సార్లా!

Repeated Titles.. ఒకే టైటిల్ ఇన్ని సార్లా!
Repeated Titles.. గతంలో వెండితెరపై సండది చేసిన టైటిల్.. ఇప్పుడు ఒకటి కాదు రెండు ఏకంగా మూడుసార్లు రిపీట్ చేస్తున్నారు.

మూవీకి స్టోరీ ఎంతో ముఖ్యమో.. టైటిల్ అంత కంటే ముఖ్యం. సినిమాకు యాప్ట్ టైటిల్‌ కోసం దర్శక నిర్మాతలు తలబద్దలుకొట్టుకుంటారు. టైటిల్ విషయంలో అసలు వెనుకడుగు వెయ్యరు. అందుకే మూవీ కథకు సరిగ్గా సరిపోయే టైటిల్ పెట్టేందుకు పాత సినిమాల పేర్లను కూడా వాడుతుంటారు. గతంలో వెండితెరపై సందడి చేసిన టైటిల్.. ఇప్పుడు ఒకటి రెండు కాదు ఏకంగా మూడేసి సార్లు కూడా రిపీట్ చేస్తున్నారు. గతంలో ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు చాలానే తెర‌కెక్క‌ాయి. కానీ ఇప్పుడు ఒకే టైటిల్‌తో మూడు సినిమాలు వస్తున్నాయి. అలా మూడు సినిమాలకు ఒకే టైటిల్‌ ఉన్న లిస్ట్ చూస్తే.. ఇదేమిటబ్బా ఇలా వాడేస్తున్నారు అనుకుంటారు.

'ఖైదీ'.. హీరోగా చిరంజీవి కెరీర్‌ను ఛేంజ్ చేసిన మూవీ. అప్పటి వరకు మూములుగా ఉన్న హీరో.. ఈ మూవీతో స్టార్ హీరోగా మారిపోయారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'ఖైదీ' 1983లో రిలీజ్ అయింది. చిరంజీవి, కోదండ రామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన ఈ తొలి మూవీ బాక్సాఫీసు బద్దలుకొట్టింది. చిరంజీవి, మాధవి, సుమలత హీరోహీరోయిన్లుగా నటించారు.

ఆ తర్వాత 'ఖైదీ నెం 150' అనే సినిమాను కూడా ఆయనే చేశారు. ముచ్చటగా మూడోసారి ఇదే టైటిల్‌తో కార్తి హీరోగా నటించిన.. 'ఖైదీ' తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది.


బ్రూస్ లీ.. ఈ టైటిల్‌కి గిరాకీ బాగానే ఉంది. ఆయ‌న చ‌నిపోయిన 40 ఏళ్ల‌కు అదే పేరుతో వరుసగా మూడు సినిమాలు తెర‌కెక్కాయి. అది కూడా ఏక‌కాలంలో కావటం విశేషం. టాలీవుడ్‌లో కూడా బ్రూస్ లీ అనే టైటిల్‌తో.. రామ్ చ‌ర‌ణ్, శీనువైట్ల‌ కాంబోలో మూవీ వచ్చింది. ఇదే సినిమాను త‌మిళ‌ంలో బ్రూస్ లీ 2 గా రిలీజ్ చేశారు. ఇదే టైటిల్‌తో రాంగోపాల్ వర్మ కూడా ఓ మూవీ తీసాడు. అయితే వ‌ర్మ తీసిన బ్రూస్ లీ మూవీ థియేటర్‌లో రిలీజ్ కాలేదు.. OTT లో విడుదలై రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ జివి ప్ర‌కాశ్ 'బ్రూస్ లీ' పేరుతో కోలివుడ్‌లో ఓ సినిమా చేశాడు.



1986లో చిరంజీవి హీరోగా 'రాక్షసుడు' విడుదలైంది. 2015లో సూర్య నటించిన తమిళ చిత్రం (మస్సు ఎంగిర మసిలమని) ఇదే పేరుతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. ముచ్చటగా మూడోసారి ఈ పేరుతో బెల్లకొండ శ్రీనివాస్ మూవీ చేశాడు‌. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాని రమేశ్‌ వర్మ తెరకెక్కించారు.


1953లో 'దేవదాసు' మూవీ విడుదలై సంచలనం సృష్టించింది. ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరరావు నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 'దేవదాసు' అంటేనే ఏఎన్ఆర్ అనేలా.. ఆ పాత్రకే వన్నె తీసుకొచ్చారు. ఇక నేను కూడా 'దేవదాసు'నే అంటూ 2016లో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు రామ్‌ పోతినేని. ఈ లవ్ స్టోరి కూడా ప్రేక్షకులను అలరించింది. ఇవి రెండు ప్రేమ కథలైతే ఇదే పేరుతో నవ్వులు పంచారు నాగార్జున, నాని. ఒకరు దేవ, మరొకరు దాస్‌గా 'దేవదాస్‌'లో సందడి చేశారు.





Tags

Read MoreRead Less
Next Story