40 ఏళ్ల క్రితం ఈ అమ్మాయి కనిపిస్తే అందర్నీ చంపేసి ఎత్తుకెళ్ళేవాడ్ని : ఆర్జీవీ

మేఘా ఆకాష్, అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'డియర్ మేఘ'. సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిన్న హైదరాబాదులో జరిగింది. వేడుకకి చీఫ్ గెస్ట్ గా వచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. హీరోయిన్ మేఘా ఆకాష్ పైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మేఘా ఆకాష్ 40 ఏళ్ల కిందట కనిపించి ఉంటే నాకు విడాకులు అయ్యేవి కావని, ఆమె చాలా క్యూట్‌గా, హోమ్లీగా ఉందని అన్నారు. ఇక మేఘా ఆకాష్ తన టైపు అఫ్ హీరోయిన్ కాదని, నా సినిమాలకు సెట్ అవ్వదని చెప్పుకొచ్చారు. ఒకవేళ 40 ఏళ్ల కిందట మేఘా ఆకాష్ కలిసుంటే రక్తచరిత్ర సినిమాలో ఓ పది మందిని చంపినట్టు చంపేసి ఆమెను ఎత్తుకెళ్ళేవాడ్ని అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు అర్జీవీ. అటు అరుణ్ అదిత్‌తో త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్టుగా వర్మ వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com