RGV: స్టేజ్‌పై ఆర్జీవీ డ్యాన్స్.. గద్దర్ పాటతో అదరగొట్టారుగా..!

RGV: ఈమధ్య సినిమా ప్రమోషన్స్ కోసం స్టా్ర్ హీరోహీరోయిన్లు సైతం రంగంలోకి దిగుతున్నారు. అంతే కాకుండా మూవీ టీమ్ అంతా కూడా ప్రమోషన్స్ విషయంలో ఏదో ఒక విధంగా కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. అందుకే తన అప్‌కమింగ్ మూవీ కోసం ఆర్జీవీనే డైరెక్ట్‌గా రంగంలోకి దిగారు. ఎప్పుడూ లేనిదీ స్టేజ్‌పై డ్యాన్స్‌తో అదరగొట్టారు.
గత కొంతకాలంగా రామ్ గోపాల్ వర్మ.. నిజంగా జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఆ దారిలోనే రాజకీయ నాయకులు కొండా సురేఖ, కొండా మురళి జీవితాల ఆధారంగా 'కొండా' అనే చిత్రాన్ని చేశారు. ఈ సినిమా జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హన్మకొండలో జరిగింది.
ఇక ప్రీ రిలీజ్ సందర్భంగా ఆర్జీవీ అందరికీ అనుకోని సర్‌ప్రైజ్ ఇచ్చారు. కొండా చిత్రంలో గద్దర్ పాడిన ఓ పాటకు వర్మ స్టేజ్‌పై డ్యాన్స్ చేశారు. ఇప్పటివరకు తాను ఎన్నో ఈవెంట్స్‌లో పాల్గొన్నా కూడా ఆర్జీవీ ఎప్పుడూ ఇలా స్టేజ్ ఎక్కి డ్యాన్స్ మాత్రం చేయలేదు. దీంతో 'మీ డ్యాన్స్ సూపర్' అంటూ ఫ్యాన్స్.. ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com