Roja Daughter: హీరోయిన్‌గా రోజా కూతురు.. స్టార్ హీరో వారసుడితో ఎంట్రీ..

Roja Daughter: సీనియర్ హీరోహీరోయిన్లు, దర్శక నిర్మాతలు.. చాలామంది ఇప్పుడు తమ వారసులను ఇండస్ట్రీలో ప్రవేశపెట్టే పనిలో బిజీగా ఉన్నారు. తాము తెరపై కనిపించినా, కనిపించకపోయినా తమ వారసులకు ఆ బాధ్యతను అప్పగించడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి సీనియర్ హీరోయిన్, మంత్రి రోజా చేరనున్నట్టు సమాచారం.
సీనియర్ నటి రోజా ఇన్నాళ్లు వెండితెరపై అప్పుడప్పుడు అలరిస్తూనే ఉన్నారు. ఒకవేళ వెండితెరపై కాకపోయినా బుల్లితెరపై మాత్రం రోజా కెరీర్ సక్సెస్‌ఫుల్‌గానే కొనసాగింది. బుల్లితెరపై ఉన్నంతకాలం ఏదో ఒక సందర్భంలో తన కూతురు అన్షు మాలికను ప్రేక్షకులను పరిచయం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రోజా.. తన కూతురు గురించి పెట్టే పోస్టులు నెటిజన్ల దృష్టిలో పడుతూనే ఉంటాయి.
ఇక రోజా వారసురాలిగా అన్షు మాలిక ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయం వచ్చేసిందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అన్షు మాలిక రైటర్‌గా గుర్తింపు దక్కించుకుంది. ఇక త్వరలోనే నటిగా ప్రేక్షకులను అలరించనుందని సమాచారం. యాక్టింగ్ కోర్స్ చేయడం కోసం అమెరికా పయనం కానుందట అన్షు. తిరిగి వచ్చిన తర్వాత ఓ స్టార్ హీరో వారసుడితో అన్షు సినీ ఎంట్రీ ఉండనుందని రూమర్స్ వైరల్ అయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com