RRR-BAFTA: జస్ట్ మిస్....

RRR-BAFTA: జస్ట్ మిస్....
బాఫ్టా అవార్డ్స్ నామినేషన్ దక్కించుకోని ఆర్.ఆర్.ఆర్

తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఆర్.ఆర్.ఆర్. వరుసగా అవార్డులను కైవసం చేసుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే ఊపులో బాఫ్టాను సైతం ఎగరేసుకుపోతుందని ఎదురుచూసిన జనాలకు నిరాశే ఎదురైంది. తృటిలో బాఫ్టా నామినేషన్ కోల్పోయింది.


2022కి గానూ నామినేషన్ల జాబితాను విడుదల చేయగా అందులో ఆర్.ఆర్.ఆర్. కు చోటు దక్కలేదు. డాక్యుమెంట్రీ క్యాటగిరీలో షౌనక్ సేన్ దర్శకత్వం వహించిన ఆల్ దట్ బ్రీత్స్ మాత్రమే భారత్ తరఫున ఎంపికైన ఏకైక చిత్రంగా నిలిచింది.


ఇటీవలే గోల్డెన్ గ్లోబ్, పీపుల్స్ ఛాయిస్ అవార్డ్స్ దక్కించుకున్న ఆర్.ఆర్.ఆర్... బాఫ్టాపైనా ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఏమైనా.. బాఫ్టా మిస్ అయిన ముందర మరిన్ని పెద్ద అవార్డ్ లు మురిపిస్తున్నాయనే చెప్పాలి. ఇదే ఉత్సాహంతో ఆర్.ఆర్.ఆర్. టీమ్ మరిన్ని పురస్కారాలు కైవసం చేసుకోవాలని ఆశిద్దాం.



Tags

Read MoreRead Less
Next Story