RRR In Oscar Race: నాటునాటు స్టెప్పులెయనున్న బ్యూటీ...

ఆర్.ఆర్.ఆర్. సినిమాలోని నాటునాటు పాట ఆస్కార్ బరిలో నిలిచిన దగ్గర నుంచి తెలుగువారి ఆలోచనలన్నీ ఆ పురస్కారం చుట్టూనే తిరుగుతున్నాయి. ఇక ఆస్కార్ కు ఈ సారి దీపిక పదుకోనే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండటం, నాటు నాటు పాట ప్రదర్శితమవుతుండటంతో ఈసారి వేడుకలు ప్రతి భారతీయుడికి ఎంతో ప్రత్యేకంగా నిలవబోతున్నాయని తెలుస్తూనే ఉంది. ఇక నాటునాటు కోసం ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్. టీమ్ మొత్తం అక్కడ ల్యాండ్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఆస్కార్ వేదికపై మరోసారి యంగ్ టైగర్, చెర్రీ స్టెప్పులు ఇరగదీస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటే... తామిద్దరం పాట పర్ఫార్మెన్స్ లో పాలుపంచుకోవడంలేదని జూ.ఎన్టీఆర్ స్పష్టం చేసేశాడు. అయితే వారి ఎనర్జీని మ్యాచ్ చేస్తూ ఎవరు పాటకు న్యాయం చేస్తారా అని చూస్తుంటే ...ఠక్కున లారెన్ తెరమీదకు వచ్చింది. ఝలక్ దిఖలాజా సీజన్ 6లో రన్నరప్ గా నిలిచి, పలు హిందీ చిత్రాల్లో నటించిన అమెరికన్ డాన్సర్ లారెన్ నాటునాటు పాటకు ఆస్కార్ వేదికపై స్టెప్పులేయబోతోందని తెలిసింది. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ లారెన్ స్వయంగా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఆస్కార్ వేదికపై నాటునాటు ప్రదర్శించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొంది. మరి కోట్ల మంది భారతీయుల కలలు సాకారమయ్యే దిశగా నాటునాటు చరిత్ర సృష్టిస్తుందేమో చూాడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com