RRR In Oscar Race: దేశీగర్ల్ తో చెర్రీ...

ఈ ఏడాది ఆస్కార్ వేడుక మనకు పండగనే తలపిస్తోంది. ఈ సందర్బంగా గ్లోబల్ ఐకాన్ ప్రియాంకా చోప్రా దక్షిణ ఆసియా దేశాల ఆస్కార్ నామినీలకు ప్రీ ఆస్కార్స్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ వేడుకకు రామ్ చరణ్, ఉపాసన దంపతులతో పాటూ, జూనియర్ ఎన్టీఆర్, మిండీ కైకే, ప్రీతీ జింటా, జాక్విలిన్ ఫెర్నాన్డేజ్, సింగర్ రాహుల్ సిప్లగంజ్ కూడా హాజరయ్యారు. ఈ మేరకు చరణ్, ఉపాసన ప్రియాంకా చోప్రోతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రియాంకను తమ కుటుంబ సభ్యురాలిగా అభివర్ణిస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇక చరణ్ బ్లాక్ సూట్ లో హుందాగా కనిపిస్తుండగా, ఉపాసన ఇంద్ర ధనుస్సును తలపించే రంగుల డిజైనర్ దుస్తుల్లో అందంగా, హుందాగా కనిపిస్తోంది. ఇక ప్రియాంకా చోప్రా ఎప్పటిలాగనే మోడ్రన్ డిజైనర్ వేర్ లో తళుక్కుమంది. మరోవైపు యంగ్ టైగర్ తో ఫోటో దిగిన ప్రీతీ జింటా దాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com