అభిమానులకు RRR టీం మరో సర్ ప్రైజ్!

అభిమానులకు RRR టీం మరో సర్ ప్రైజ్!
అభిమానులకి మరో గుడ్ న్యూస్ చెప్పింది ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర యూనిట్.. సినిమాకి సంబంధించిన క్లైమాక్స్‌ ను మొదలుపెట్టినట్టుగా వెల్లడించింది.

అభిమానులకి మరో గుడ్ న్యూస్ చెప్పింది ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర యూనిట్.. సినిమాకి సంబంధించిన క్లైమాక్స్‌ ను మొదలుపెట్టినట్టుగా వెల్లడించింది. లక్ష్యాన్ని సాధించేందుకు రామరాజు, భీమ్‌ వస్తున్నారంటూ ఓ ట్వీట్ చేసింది. ఈ అద్భుతమైన పోరాటం థియేటర్లలో కనువిందు చేస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ, అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా, డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మిస్తున్నారు. సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story