రామ్‌చ‌ర‌ణ్ వాయిస్‌తో కొమ‌రం భీం టీజ‌ర్..!!

రామ్‌చ‌ర‌ణ్ వాయిస్‌తో కొమ‌రం భీం టీజ‌ర్..!!

దర్శకధీరుడు రాజ‌మౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న మూవీ 'రౌద్రం రణం రుధిరం' (ఆర్‌ఆర్‌ఆర్). మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్‌‌టి‌ఆర్ లతో మల్టీస్టారర్ మూవీగా వస్తుంది. జక్కన్న ఈ మూవీని ప్రకటించినప్పటి నుంచి.. ఆ మూవీ కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ఎంతో ఆసక్తితో ఉన్నారు. ఇటీవల రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. అల్లూరి సీతారామ‌రాజు లాంటి ప‌వ‌ర్‌ఫుల్ పాత్రలో చెర్రీ బాడి షేపింగ్ తో.. అద్బుత‌మైన విజువ‌ల్స్ తో.. తారక్ వాయిస్ ఓవ‌ర్ తో టీజర్ రిలీజ్ చేశారు.

అయితే త‌రువాత తారక్ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా కొమ‌రం భీమ్ టీజ‌ర్ రిలీజ్ చేయాలనుకున్నారు. కాని కరోనా ప్యాండమిక్ సిట్యూవేష‌న్ వల్ల కుద‌ర‌లేదు. లాక్‌డౌన్ కారణంగా సుమారు 7 నెలలు పాటు ఆర్ ఆర్ ఆర్ టీం ఇంటికే పరిమితం కావడంతో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ టీజర్ వీలుపడలేదు.

మొత్తానికి ఆ సమయం ఆసన్నమవుతోంది. ఆక్టోబ‌ర్ 22న ద‌స‌రా కానుక‌గా కొమ‌రం భీమ్ టీజ‌ర్ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సారి రామ్‌చ‌ర‌ణ్ వాయిస్ ఓవ‌ర్ కొమ‌రం భీం టీజ‌ర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ టీజర్‌కి ఇప్ప‌టికే రామ్‌చ‌ర‌ణ్ డ‌బ్బింగ్ చెప్పిన‌ట్టు తెలుస్తుంది. అంతే కాదు డ‌బ్బింగ్ విష‌యం లో చాలా కేర్ తీసుకుని చెప్పార‌ట. ఉద‌యం లేవ‌గానే గోంతుకు సంబంధించిన లిక్విడ్స్ తీసుకుని మ‌రి డ‌బ్బింగ్ చెప్పారట. ఇక్క‌డ మరో విష‌యం ఏమిటంటే అన్ని భాష‌ల్లో రామ్ చ‌ర‌ణ్ డబ్బింగ్ చెప్పారు.

అల్లూరి సీతారామ‌రాజు టీజ‌ర్ లో తారక్ వాయిస్ ఇప్పించి ఇద్ద‌రి హీరోల‌కి న్యాయం చేశారు. ఇప్పుడు కొమ‌రం భీమ్ టీజ‌ర్ లో తారక్ విజువ‌ల్స్ తో చెర్రీతో వాయిస్ చెప్పించినట్లు తెలుస్తోంది. చెర్రీ, తారక్ పాత్ర‌లు సమానంగా స‌మ‌రంగా ఉండేలా పాన్లు చేస్తున్న.. జక్కన్న తెలివితేట‌ల‌ని మెచ్చుకొవాలి.

Read MoreRead Less
Next Story