Sadha: పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు.. కానీ: సదా

Sadha: పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు.. కానీ: సదా
Sadha: ఇప్పుడు ‘హలో వరల్డ్’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులకు మళ్లీ కొత్తగా పరిచయం కానుంది సదా.

Sadha: పెళ్లయినా కూడా హీరోయిన్స్ కెరీర్ నిలకడగానే ఉంటుందని ఇప్పటికే పలువురు నటీమణుల వల్ల ప్రూవ్ అయ్యింది. అయినా కూడా కొందరు హీరోయిన్స్ మాత్రం ఇంకా పెళ్లి మీద ఆసక్తి చూపించడం లేదు. ఒకప్పుడు కెరీర్ పట్టాలు తప్పితే పెళ్లి వైపు వెళ్లే వారు. కానీ ఈరోజుల్లో అలాంటి వారు కూడా తక్కువయిపోయారు. అలాంటి వారిలో ఒకరే సీనియర్ హీరోయిన్ సదా.


సదాకు నితిన్‌తో నటించిన 'జయం' డెబ్యూ మూవీ. అయినా కూడా తొలి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు దర్శక నిర్మాతల చూపు కూడా తనవైపు తిప్పుకుంది. దీంతో తనకు వెంటవెంటనే అవకాశాలు కూడా వచ్చాయి. కానీ అవేవి తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లలేకపోయాయి. తమిళంలో కూడా పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటించిన సదా.. వెంటనే అవకాశాలు లేక సినిమాల నుండి బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. దీంతో బుల్లితెరపై కూడా అడుగుపెట్టింది.


ఇప్పుడు 'హలో వరల్డ్' అనే వెబ్ సిరీస్‌తో మళ్లీ కొత్తగా ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్‌ సమయంలో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సదా. తాను అవకాశాలు లేక యూట్యూబ్ ఛానెళ్ పెట్టినప్పుడు తనను పెళ్లి చేసుకోమని చాలామంది సలహా ఇచ్చారని గుర్తుచేసుకుంది. అలాంటి వారికి తాను సమాధానం చెప్పనని తేల్చిచెప్పింది. అంతే కాకుండా ఈమధ్యకాలంలో పెళ్లయిన జంటలు చాలావరకు హ్యాపీగా ఉండడం లేదని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది సదా.


పార్టీలు, పబ్‌లు, నైట్ ఔట్స్ లాంటివి తనకు అస్సలు నచ్చవని తన వ్యక్తిత్వం గురించి చెప్పుకొచ్చింది సదా. అంతే కాకుండా తనకు కాబోయే భర్తలో తనకు కావాల్సిన క్వాలిటీస్ కూడా రివీల్ చేసింది. తాను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి వెజిటెరియన్‌ అయ్యి ఉండాలని చెప్పింది. తను ధనవంతుడు కాకపోయినా ఒకరిపై ఆధారపడే గుణం ఉండకూడదని తెలిపింది. ముఖ్యంగా తన సంపాదనపై అస్సలు ఆధారపడొద్దని ఘాటు వ్యాఖ్యలే చేసింది సదా. ఇక అలాంటివాడు దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story