Sadha: 'అలాంటప్పుడే డిప్రెషన్‌లోకి వెళ్తుంటారు'.. ఉదయ్ కిరణ్ విషయంలో సదా కామెంట్స్

Sadha: తెలుగులో ఏ సపోర్ట్ లేకపోయినా.. హీరో అవ్వాలన్న కోరికతో వచ్చి వెనుదిరిగిన వారు కొందరైతే.. స్టార్ హీరో స్టేటస్‌ను తెచ్చుకుని తనలాంటి కోరికతో ఉన్నవారికి స్ఫూర్తిగా నిలిచేవారు మరికొందరు. అలాంటి వారిలో ఒకరు యంగ్ హీరో ఉదయ్ కిరణ్. కానీ ఉదయ్ కిరణ్ హఠాన్మరణం ఒక్కసారిగా సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పటికీ తన గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారంటే తన సినిమాలే కారణం. ఇటీవల సదా కూడా ఉదయ్ కిరణ్ మరణంపై స్పందించింది.
'జయం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది సదా. అయినా కూడా తొలి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు దర్శక నిర్మాతల చూపు కూడా తనవైపు తిప్పుకుంది. దీంతో తనకు వెంటవెంటనే అవకాశాలు కూడా వచ్చాయి. అలాంటి సమయంలోనే ఉదయ్ కిరణ్‌తో కూడా 'ఔనన్నా కాదన్నా' అనే చిత్రం చేసింది సదా. ఇక ఇటీవల 'హలో వరల్డ్' అనే సిరీస్‌తో ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న సదా.. ఉదయ్ కిరణ్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుంది.
ఉదయ్ కిరణ్ లాంటి నటుడిని కోల్పోవడం చాలా దురదృష్టం అని చెప్పుకొచ్చింది సదా. వరుసగా విజయవంతమైన చిత్రాల్లో నటించారని గుర్తుచేసుకుంది. కానీ తన కెరీర్‌లో ఎక్కడ తప్పు జరిగిందో, అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో మాత్రం తెలియదని చెప్పింది. జీవితం కెరీర్‌కంటే గొప్పది అని, అయినా సినిమాలు ఫ్లాప్ అయితే నటీనటులు డిప్రెషన్‌లో వెళ్తుంటారని స్పష్టం చేసింది. సినిమాలు ఆడడం, ఆడకపోవడం మన చేతుల్లో ఉండవని, నటులుగా మన బెస్ట్ ఇవ్వాలని తెలిపింది సదా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com